¤ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద్రవ్యసామర్థ్య రేటింగ్‌కు అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించింది. తక్కువగా ఉన్న టైర్-1 మూలధన నిష్పత్తితో పాటు ఆస్తుల నాణ్యత క్షీణించే అవకాశం ఉన్నందున రేటింగ్‌ను ఒక అంచె తగ్గించినట్లు మూడీస్ తెలిపింది. ¤ బ్యాంక్ ద్రవ్య సామర్థ్య రేటింగ్ (బీఎఫ్ఎస్ఆర్)ను 'సి- నుంచి 'డి+కు సవరించినట్టు వెల్లడించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరనికి భారత వృద్ధిరేటు అంచనాను క్రిసిల్ తగ్గించింది. గతంలో 8 శాతం వృద్ధిరేటు సాధించగలదని భావించగా తాజాగా దాన్ని 7.6 శాతానికి సవరించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్థి చెందగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
¤ రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే లక్ష్యంతో వసుసగా 13వ సారి రెపోరేటును పావుశాతం పెంచి 8.5 శాతానికి సవరించారు. రివర్స్ రెపోరేటు 7.5 శాతం ఉంటుంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 6 శాతం వద్ద, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎన్ఎల్ఆర్) 24 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతాయి. ¤ ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను 8 శాతం నుంచి 7.6 శాతానికి సవరించారు. |
No comments:
Post a Comment