|
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలినెలలో ఎగుమతులు ఆకర్షణీయంగా 34.4 శాతం పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది ఏప్రిల్ నెలలో 2,380 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,07,100 కోట్ల) ఎగుమతులు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఎగుమతులు 1770 కోట్ల డాలర్లు ఉన్నాయి. అయితే మార్చి నెల ఎగుమతుల్లో నమోదైన 44 శాతం వృద్ధిరేటు కంటే ఏప్రిల్ వృద్ధి రేటు తక్కువ. ¤ ఏప్రిల్ నెలకు దిగుమతులు కూడా 14.1 శాతం పెరిగి 32,80 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో ఏప్రిల్ నెల వాణిజ్యలోటు 900 కోట్ల డాలర్లుగా నమోదైంది. ¤ గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు ఆకర్షణీయంగా 37.55 శాతం పెరిగాయి. దిగుమతులు 21.6 శాతం పెరిగి 35,000 కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 10,400 కోట్ల డాలర్లు.
¤ జెన్-ఐ కు చెందిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ల వ్యాపారాన్ని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. టెలికాం న్యూజిలాండ్ గ్రూపులో కార్పొరేట్ ఐసీటీ విభాగమే జెన్-ఐ.
¤ రిజర్వు బ్యాంకు మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. ముఖ్యాంశాలు: ¤ రెపో రేటు పావు శాతం పెంపుతో 7.5 శాతానికి రింది. ¤ రివర్స్ రెపో రేటు సైతం పావు శాతం పెంపు. 65 శాతానికి చేరిక. ¤ వరుసగా పదోసారి కీలక రేట్లను ఊర్థ్వముఖంగా సవరించడం గమనార్హం. ¤ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని సైతం 25 బేసిస్ పాయింట్లు సవరించి 8.5 శాతానికి పెంచింది. ¤ ఇతర కీలక రేట్లు, నిష్పత్తుల్లో మార్పు లేదు. ¤ 2011 మే 3 వార్షిక పరపతి విధానం తర్వాత 43 బ్యాంకులు తమ ప్రాతిపదిక రేటును 25-100 బేసిస్ పాయింట్ల మీద పెంచాయి.
¤ మార్కెట్ విలువలో రిలయన్స్ కంపెనీలను టాటా గ్రూప్ అధిగమించింది. టాటా గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 4,40,000 కోట్లకు చేరింది. భారత స్టాక్ మార్కెట్‌లో ఒక కార్పొరేట్ గ్రూపు అత్యధిక మార్కెట్ విలువ ఇది. మరోవైపు అంబానీ సోదరులకు చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 3,67,000 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం టాటా గ్రూప్ కంపెనీల కన్నా రిలయన్స్ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది.
¤ ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 23 శాతం మేర వృద్ధిచెంది రూ. 1,01,600 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమీక్ష కాలంలో ఇవి రూ. 82,300 కోట్ల మేర నమోదు కావడం గమనార్హం. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 54,600 కోట్ల నుంచి రూ. 67,100 కోట్లకు చేరాయి. ¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) సైతం ఏప్రిల్ నెలలో 43 శాతం అధికంగా 3.12 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2010 ఏప్రిల్‌లో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐ విలువ 2.17 బిలియన్ డాలర్లు.
¤ రాష్ట్రంలో 2010-11లో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు జాతీయ సగటును మించి అభివృద్ధిని కనబరచాయి. స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో జాతీయ వృద్ధి రేటు 8.55 శాతాన్ని అధిగమించి రాష్ట్ర వృద్ధి రేటు 9.22 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ. 60,458కి ఎగబాకింది. ¤ పంటలతో సహా కొన్ని రంగాల పూర్తిస్థాయి ఉత్పత్తులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర అర్థ గణాంక శాఖ ముందస్తు అంచనాలను తాజాగా సవరించింది. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ప్రసంగంలో పేర్కొన్న 8.58 శాతం కన్నా ప్రస్తుతం 0.64 శాతం ఎక్కువగా వృద్ధిరేటు కనిపించింది. వ్యవసాయ రంగంలో ఏకంగా 9.10 శాతం వృద్ధి నమోదు కావటం గమనార్హం. 2009-10లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కేవలం 1.09 శాతానికే పరిమితమయ్యింది. ¤ ప్రస్తుత ధరలు, జనాభాకు అనుగుణంగా తలసరి ఆదాయాన్ని ఇంతకు ముందు రూ.60,224 గా అంచనా వేయగా ఇప్పుడది రూ.60,458కి చేరింది. ¤ మూడు ప్రధాన రంగాల్లో కలిపి 2004-05 స్థిర ధరల ప్రకారం మొత్తం రూ.3.72 లక్షల కోట్ల విలువైన స్థూల ఉత్పత్తి జరిగింది. 2009-10 లో ఇది రూ.3.40 లక్షల కోట్లుగా నమోదైంది. ¤ ఆగస్టులో మరోసారి అంచనాలు సవరించనున్నప్పటికీ ఇప్పటికే వాస్తవ ఉత్పత్తులను లెక్కలోకి తీసుకొన్నందున వృద్ధి రేట్లలో పెద్దగా మార్పులేవీ ఉండబోవని అర్థ గణాంక అధికార వర్గాలు తెలిపాయి.
¤ స్థూల ఉత్పత్తిలో ప్రధాన రంగాల ప్రగతి (శాతాల్లో) రంగం రాష్ట్రం జాతీయం వ్యవసాయం 9.10 6.61 పరిశ్రమలు 8.45 7.87 సేవలు 9.64 9.38 |
¤ స్థూల ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డ కొన్ని విభాగాలు విభాగం కిందటేడాది కన్నా వృద్ధి (శాతాల్లో) ప్రజాపరిపాలన 17.32 మత్స్య పరిశ్రమ 14.5 స్థిరాస్థి, స్టోర్‌జీ 10.85 నిర్మాణం 9.68 మైనింగ్, క్వారియింగ్ 10.15 ¤ ప్రదాన రంగాల ఉత్పత్తులు ( రూ. కోట్లలో) రంగం 2009 - 10 2010 - 11 వ్యవసాయం 73,633 80,330 పరిశ్రమలు 83,107 92,293 స్ల్కేలు 1,81,972 1,99,514 ¤ తలసరి ఆదాయం పెరుగుదల ఇలా... (రూపాయిల్లో) సంవత్సరం తలసరిఆదాయం వృద్ధిరేటు 2005 - 06 28,539 12.7 2006 - 07 33,135 16.1 2007 - 08 39,727 19.9 2008 - 09 45,007 13.3 2009 - 10 51,025 13.4 2010 - 11 60,458 18.49 ¤ ఆదాయం రూ. 5 లక్షల లోపు అయితే ఆదాయ రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదు. ఈ మేరకు మినహాయింపునిచ్చే పథకాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫై చేసింది. 2011- 12 (జూలై 31, 2011 లోపు దాఖలు చేయాల్సి ఉన్న) మదింపు సంవత్సరం నుంచి ఈ పథకం వర్తిస్తుంది. ¤ 2010- 11 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉన్నవారికి (అనుమతిచ్చిన తగ్గింపుల తర్వాత) ఇది ప్రయోజనం. ¤ ఉద్యోగికి వచ్చే జీతం, డిపాజిట్ల పై వచ్చే వడ్డీ (సేవింగ్స్ ఖాతాలో) ఆదాయం రూ.10,000 వరకు ఉన్నా దాఖలు చేయనక్కర్లేదు. |
¤ పావలా నాణేలు ఇక తెరమరుగు కానున్నాయి. జులై 1 నుంచి అవి చాలామణిలో ఉండవని రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.
|
No comments:
Post a Comment