Monday, July 21, 2014

ఆగస్టు -2011 ఆర్థికరంగం

ఆగస్టు 1 
¤ భారత ఎగుమతులు జూన్‌లో 46.45 శాతం మేర పెరిగాయి. వాటి విలువ 29.21 బిలియన్ డాలర్లకు (సుమారుగా రూ.1,19,761 కోట్లకు) చేరుకొంది. అంతక్రితం సంవత్సరం జూన్ నెల వస్తురూప ఎగుమతులు 19.94 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.87,730 కోట్లు)గా నమోదయ్యాయి.
¤
 జూన్ ఎగుమతుల గణాంకాలు అందించిన దన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎగుమతులు మొత్తం మీద 79 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3,55,500 కోట్లకు) పెరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన సమాచారం వెల్లడిస్తోంది.
¤
 జూన్ మాసంలో దిగుమతులు కూడా 42.4% ఎగబాకాయి. వాటి విలువ 36.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,65,600 కోట్లు)గా నమోదయింది.
ఆగస్టు 3 
¤ అంతర్జాతీయం
¤
 ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన ఇంగ్లక్ షనవత్రాను థాయ్‌లాండ్ పార్లమెంట్ దేశ ప్రథమ మహిళ ప్రధానమంత్రిగా లాంఛనంగా ఎన్నుకుంది. దిగువ సభలో మొత్తం 500 మంది సభ్యులుండగా 296 మంది సభ్యులు ఆమెకు మద్దతు ప్రకటించారు.
¤
 ఈ నేపథ్యంలో స్పీకర్ సోమసన్ షినవత్రాను నూతన ప్రధాన మంత్రిగా ప్రకటించారు.
¤
 నాటో దాడుల్లో లిబియా అధ్యక్షుడు గడాఫీ చిన్నకుమారుడు ఖామిస్ మరణించినట్లు తిరుగుబాటుదారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మరో 31 మంది కూడా మరణించారని తెలిపారు. దీన్ని లిబియా ప్రభుత్వం ఖండించింది.
ఆగస్టు 5 
¤ హార్లే- డేవిడ్‌సన్ 'ఫ్యాట్ బోయ్' మోడల్‌లో కొత్త రకం బైక్‌ను విడుదలచేసింది. బైక్ ధర రూ.19.7 లక్షలు.
¤
 2009 ఆగస్టులో భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది.
ఆగస్టు 8  
¤ అమెరికా ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు పెరగడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు విలవిలలాడాయి. యూరప్ రుణ సమస్యల ప్రభావం తోడవడంతో ప్రపంచ షేర్ బజార్‌లు మూడు శాతం నష్టపోయాయి.
¤
 అమెరికా కొంప ముంచిన స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) రేటింగ్ సంస్థ భారత్ పైనా బాంబు పేల్చింది. భారత్ సహా ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాలకు మున్ముందు కష్టకాలం తప్పదని చెప్పింది.పనిలో పనిగా అమెరికాలో మరిన్ని ప్రభుత్వ సంస్థల పరపతి రేటింగును కుదించి వేసింది. వీటిలో ఫ్రెడ్డీ మ్యాక్, ఫ్యానీమ్, పది గృహరుణ బ్యాంకులు ఉన్నాయి.
¤
 బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ మొత్తం మీద 3416 పాయింట్ల నష్టంతో ముగిసింది.
¤
 ఒక వైపు మార్కెట్లు కుప్పకూలుతుంటే మరోవైపు బంగారం ధర ధగధగమంటోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఔన్సు 1700 డాలర్లకు, దేశీయంగా తులం రూ. 25,000కు, ఫ్యూచర్స్‌కురూ. 26,000కు చేరి చరిత్రను సృష్టించింది. ఆపత్కాలంలో సురక్షితమైన మదుపుగా భావించి, కొనుగోళ్లకు ఎగబడడమే పుత్తడి జోరుకు కారణమైంది 
ఆగస్టు 13 
¤ కాపర్ నికెల్ 50 పైసల నాణేలను, కాపర్ నికెల్ ఒక్కరూపాయి నేణేలను వెనక్కి తీసుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. వాటి స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ నాణేలను విడుదల చేయనుంది. కాపర్ నికెల్ రూ.2 నాణేలను ఇకపై విడుదల చేయకూడదని కూడా ఆర్‌బిఐ నిర్ణయించింది. 
ఆగస్టు 14 
¤ సంయుక్త ప్రయోజనాలున్న అంశాల్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడం కోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఆయిల్ ఇండియాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 
ఆగస్టు 15 
¤ సెల్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మొబిలిటీని 1250 కోట్ల డాలర్లను కొనుగోలు చేయునున్నట్లు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పదం కుదుర్చుకున్నట్లు రెండు కంపెనీలు ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
ఆగస్టు 17 
¤ గత ఆర్థక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 1.7 లక్షలు కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి మూడింతలై 5.6 లక్షల కోట్ల డాలర్లకు (ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం రూ. 252 లక్షల కోట్లు)చేరగలదని పరిశోదన సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అంచనా వేస్తోంది. వేగంగా పెరుగుతున్న పెట్టుబడుల, వినియోగ వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చు దీనికి కారణమని తెలిసింది.
¤ 2009-10 ఏడాది జీడీపీలో సేవల రంగవాటా 57.3 శాతం ఉండగా 2019-20 నాటికి 61.8 శాతానికి చేరనుంది. డీఅండ్‌బీ నివేదిక 'ఇండియా 2020 లోని ముఖ్యాంశాలు:
¤ 2020 నాటికి మహరాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లు బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మారనున్నాయి. జీడీపీలో వీటి వాటా 32 శాతానికి పైగా ఉండు వీలుంది.
¤ ఈ దశాబ్దంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వాటా జీడీపీలో గణనియంగా పెరింగింది. 2019-20 నాటికి వీటి వాటా 21.1 నుంచి 24 శాతానికి చేరునుంది.
¤ ప్రభుత్వ విధాన నిర్ణయాలు తయారీ, రిటైల్‌రంగాలను బాగా ప్రోత్సహిస్తాయి.
¤ నేరుగా నగదు సబ్సిడీ చెట్లించడం, యూడీఐ, పర్యావరణ జాతీయ తయారీ విధానాలు, రిటైల్, బీమా వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత వృద్ధిరేటు నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
¤ కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం వృద్ధిరేటుకు ఉన్న అవరోధాలను తొలగిస్తుంది.
¤ స్వల్ప కాలానికి ద్రవ్యోల్బణం ఇబ్బంది కలిగించినా దీర్ఘ కాలానికి అదుపులోకి వస్తుంది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరనికి జీడీపీ వృద్ధిరేటు 8.1 శాతానికి పరిమితం కాగలదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేసింది. గతంలో ఈ వృద్థరేటు 8.6 శాతం ఉండగలదని పేర్కొంది.
¤ వ్యవసాయరంగం వృద్ధి రేటును 3.2 శాతం నుంచి పత్తి దిగుబడులు తగ్గగలవన్న అంచనాలే కారణం. పారిశ్రామిక వృద్ధి రేటును 8.9 శాతం నుంచి 8.6 శాతానికి పరిమితం చేసింది.
ఆగస్టు 19 
¤ వచ్చే ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో బలహీన పరిస్థితులు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని 2011-12 ఏడాదికి వృద్ధిరేటును 7.8 శాతం నుంచి 7.4 శాతానికి పరిమితం చేసింది.
ఆగస్టు 21 
¤ దేశంలో అతిపెద్ద పది కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) గతవారం రూ.39,892.81 కోట్ల మేరకు తగ్గింది.
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తోసి రాజని మార్కెట్ విలువలో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. నాలుగేళ్లకు పైగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్ రెండో స్థానానికి పడిపోయింది
.
¤ గతవారం కోల్ ఇండియా మార్కెట్ విలువ రూ.5,305.74 కోట్లు పెరిగి రూ.2,48,675.09 కోట్లకు చేరింది
.
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ.9,691.84 కోట్ల మేరకు తగ్గి రూ.2,39,414.62 కోట్లకు పరిమితమైంది. 2010, నవంబరులో నమోదైనప్పటి నుంచి కోల్ ఇండియా పెరుగుతూనే ఉంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.15 కోట్లకు పైగా సమీకరించింది. ఈ షేర్లకు సంబంధించిన మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.1,50,000 కోట్లకు పైగా ఉంది
.
¤ కోల్ ఇండియా, రిలయన్స్ తర్వాత మార్కెట్ విలువ పరంగా ఓఎన్‌జీసీ మూడో స్థానంలో ఉంది
.
¤ మెర్సిడెజ్-బెంజ్ తన ప్రతిష్ఠాత్మకమైన జీక్లాస్ వాహన శ్రేణిలో విశిష్టమైన జీ -55 ఏఎంజీ వాహనాన్ని తాజాగా భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. మొదట్లో దీన్ని సైన్యం అవసరాల కోసం తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఎస్‌యూవీ విభాగంలో ఒక మోడల్‌గా పరిచయం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది
.
¤ జీ-55 ఏఎంజీకి 5.5 లీటర్ల వీ-8 ఇంజిన్‌ను అమర్చారు. దీని గరిష్ఠవేగం గంటకు 210 కి.మీ కావడం విశేషం. దీని ధర సుమారు రూ. 1.50 కోట్లుగా ఉంటుంది
.
ఆగస్టు 22 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి 64,392 టన్నుల ముడి పొగాకు, పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.103.75 కోట్లు
¤ గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఎగుమతులు పరిమాణం పరంగా 9 శాతం, విలువ పరంగా 7 శాతం పెరిగాయి
.
¤ మన దేశం నుంచి ప్రధానంగా బెల్జియం, ఈజిప్టు, రష్యా, నెదర్లాండ్స్, జర్మనీ, యెమెన్, ఫిలిఫ్పైన్స్‌కి పొగాకు ఎగుమతులు జరుగుతాయి
.
¤ భారత పొగాకు బోర్డు ప్రస్తుత ఛైర్మన్ జి.కమలవర్ధనరావు
ఆగస్టు 23 
¤ వచ్చే అయిదేళ్లలో పారిశ్రామిక రంగంలో 10.5 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికా సంఘానికి తెలియజేసింది.
¤ 2012 నుంచి ప్రారంభమయ్యే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు మూడింటిలోనూ కలిపి 10 శాతం వృద్ధి రేటు సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యవసాయంలో 6 శాతం, పారిశ్రామిక రంగంలో 10.5 శాతం, సేవా రంగంలో 11.5 శాతం వృద్ధిని నమోదు చేయగలిగతేనే ప్రభుత్వం ఆశిస్తున్న 10 శాతం సాధ్యమవుతుంది
.
¤ ప్రస్తుత 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో ఇప్పటికే నాలుగేళ్లు గడచిపోయినా పారిశ్రామిక వృద్ధి లక్ష్య సాధనలో మాత్రం రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. ఈ ప్రణాళికలో 9.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉండగా 6.8 శాతంతో సరిపెట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా 10.5 శాతం వృద్ధి రేటు వైపునకు దూసుకెళ్లాలంటే చాలా సమర్థవంతమైన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉంటుంది
.
¤ రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలో ప్రణాళిక సంఘం తన మార్గ నిర్దేశక పత్రం ద్వారా ఇప్పటికే తెలియజేసింది. బలహీనంగా ఉన్న తయారీ రంగాన్ని పటిష్ఠం చేసి ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించడం, పారిశ్రామిక విధానాలను సక్రమంగా అమలు చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది
.
¤ తాము ఆశిస్తున్న వృద్ధిరేటుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగానే ప్రణాళిక సంఘానికి ప్రభుత్వం నివేదించింది. 2010-15 మధ్య అమలయ్యే నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. 27 ప్రత్యేక ఆర్థిక మండళ్లు వచ్చే మూడేళ్లలో రూ. 12,296 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయనున్నాయని, వీటిలో 86,652 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. మన్నవరంలో ఇంధన పరికరాల ప్రాజెక్టుతో సహా అనేక పరిశ్రమలు వస్తున్నట్టు పేర్కొంది
.
¤ పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఇక భూ సేకరణ ప్రధానాంశం కానుంది. భూ సేకరణకు కొత్త చట్టం అమల్లోకి రావడం, పరిశ్రమలకు భూముల కేటాయింపుపై రాష్ట్ర స్థాయిలో కొన్ని విధివిధానాలను రూపొందించడం లాంటి కారణాల వల్ల పారిశ్రామిక విధానంలో భూములే ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి
.
¤ రాష్ట్రంలో గడచిన నాలుగేళ్లలో భూకేటాయింపు సమస్య పెద్దగా లేకున్నా ఇతర కారణాల వల్ల పారిశ్రామిక రంగం వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ముఖ్యంగా విద్యుత్తు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా తయారీ రంగాలు పెద్దగా పురోగమించలేదు
.
¤ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిశ్రమల రంగం వాటా 2007-08లో 25.53 శాతం ఉండగా 2010-11 నాటికి అది 24.73 శాతానికి తగ్గింది
ఆగస్టు 28 
¤ 2005-06 నుంచి 2010-11 ల మధ్య కాలంలో ఎనిమిది రకాల నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 72 శాతం పెరిగాయి. అదే సమయంలో సగటు భారతీయుడు తలసరి ఆదాయం మాత్రం 38 శాతం పెరిగినట్టు ఆసోచామ్ తన తాజా సర్వేలో వెల్లడించింది
ఆగస్టు 29 
¤ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సీ)కు కఠినతరమైన కొత్త నియమ నిబంధనలను వర్తింపజేయాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. బ్యాంకులకు వర్తిస్తున్న అకౌంటింగ్ నియమాలనే ఎన్‌బిఎఫ్‌సీ లకు వర్తింపజేయాలని ఈ బృందం పేర్కొంది. ఈ కమిటీ చేసిన సూచనలు
¤ రూ.1000 కోట్లకు మించిన ఆస్తులు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు అన్ని స్టాక్ ఎక్జేంజీల్లో నమోదైనా, నమోదు కాకపోయినా సెబీ నమోదు ఒప్పందంలోని 49వ క్లాజుకు లోబడి ఉండేలా చూడాలి
.
¤ ఎన్‌బీఎఫ్‌సీ లకు ప్రతి సంవత్సరం స్ట్రెస్ టెస్టులు, తనిఖీలు జరపాలి. దీనివల్ల అవి ఎంత వరకు కచ్చితమైనవో తేలిపోతుంది
.
¤ ఎన్‌బీఎఫ్‌సీలు నమోదైన నాటినుంచి మూడు సంవత్సరాల్లోపు కనీసం 12 శాతం మేర ఒకటో అంచె, కనీస మూలధన నిష్పత్తి (సీఏఆర్)ను కలిగి ఉండాలి. (సీఏఆర్ అనేది బ్యాంకుల కీలక మూలధనానికి, నష్టభయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే నిష్పత్తి
)
¤ ఆర్‌బీఐ వద్ద ఎన్‌బీఎఫ్‌సీగా రిజిస్టర్ కావడం రుణ దాతలకు, పెట్టుబడి దారులకు సంతృప్తిని కలగజేసే విధంగా ఒక గుర్తింపును సంతరించాలి.
¤ కొత్త ఎన్‌బీఎఫ్‌సీలు కనీసం రూ.50 కోట్ల ఆస్తులు కలిగి ఉండాలి
.
¤ ఎన్‌బీఎఫ్‌సీలో 25 శాతానికి పైగా వాటా మార్పునకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతిని పొందడం తప్పనిసరి
.
¤ బ్రోకర్లకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు పాటిస్తున్న తరహా నియమావళినే ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ పాటించాలి.
¤ ఎన్‌బీఎఫ్‌సీ లకు సైతం బ్యాంకు ప్రొవిజన్ మాదిరి నియమాలను దశలవారిగా వర్తింపజేయాలి
ఆగస్టు 30 
¤ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి భారత్‌కు 20 కోట్ల యూరోల (దాదాపు రూ. 1,300 కోట్లు) రుణం లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుకు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఈఐబీ) ఈ రుణాన్ని అందిస్తుంది. భారత్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఈయూ ఈ సాయం చేస్తోంది.
¤ ప్రైవేటు కంపెనీలు చేపట్టే సోలార్ ఫొటో వోల్టాయిక్, బయోమాస్, పవన విద్యుత్ లాంటి పర్యావరణ అనుకూల సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు రుణసాయానికి ఈ నిధులను వినియోగిస్తారు
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు కేవలం 7.7 శాతంగా నమోదయింది. ఒకటిన్నర ఏళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి. 2009-10 అక్టోబరు-డిసెంబరులో 7.3 శాతంగా నమోదైన తర్వాత ఇదే తక్కువ స్థాయి వృద్ధి కావడం గమనార్హం
.
¤ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 8.8 శాతంగా నమోదవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధిరేటు 8.5 శాతంగా నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది
.
¤ జూన్ 30, 2011తో ముగిసిన త్రైమాసికంలో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది
.
¤ తవ్వకాల రంగం కేవలం 1.8 శాతం వృద్ధితో సరిపుచ్చుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 7.4 శాతంగా నమోదైంది
.
¤ వ్యవసాయ రంగం మాత్రం 2.4 నుంచి 3.9 శాతానికి పెరిగి కొంత ఊరటనిచ్చింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ల విభాగం సైతం 12.1 నుంచి 12.8 శాతానికి పుంజుకోవడం విశేషం
.
¤ బీమా, స్థిరాస్థిరంగం మాత్రం 9.8 నుంచి 9.1 శాతానికే పరిమితమైంది
.
¤ కీలకమైన ఎనిమిది మౌలిక సదుపాయల పరిశ్రమలు జూలై నెలలో 7.8 శాతం మేర పురోగమించాయి. ఇది పారిశ్రామికోత్పత్తి మెరుగు పడుతోందన్న ఆశలు రేకెత్తిస్తోంది. 2010 జూలైలో ఈ పరిశ్రమల వృద్ధి 5.7 శాతం మాత్రమే
.
¤ విద్యుత్తు, ఉక్కు, సిమెంటు ఉత్పత్తి ఆరోగ్యకరమైన పెరుగుదలను కనబరచడం తాజా వృద్ధికి దారితీసినట్లు న్యూఢిల్లీలో విడుదల చేసిన ప్రొవిజనల్ డేటాలో పేర్కొన్నారు. అయితే, ఇదే ఏడాది జూన్‌లో కీలక మౌలిక పరిశ్రమలు 5.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి
.
¤ ఈ ఎనిమిది పరిశ్రమల్లోనూ ముడి చమురు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, సహజ వాయువు, ఎరువులు, బొగ్గు, విద్యుత్తు, సిమెంటు, ఫినిష్డ్ స్టీలు ఉన్నాయి
.
¤ మొత్తం మీద పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమలకు 37.90 శాతం వెయిటేజి ఉంది
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) కీలక పరిశ్రమలు 5.8 శాతం మేరకు పురోగమించాయి. కిందటి సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పరిశ్రమలు 6.5 శాతం వృద్ధిని సాధించాయి.
 

No comments:

Post a Comment