Monday, July 21, 2014

జులై 2011 - ఆర్థికరంగం

జులై 1 
¤ 2011 మే నెలలో భారత ఎగుమతులు 25.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2010 మేలో భారత ఎగుమతుల విలువ 16.53 బిలియన్ డాలర్లు. 2011 మేలో దిగుమతులు కూడా 40.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత నాలుగు సంవత్సరాల్లో అత్యధిక పెరుగుదల రేటు కావడం విశేషం.
జులై 4 
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మేలో భారీ స్థాయిలో తరలివచ్చాయి. ఏకంగా 111 శాతం వృద్ధితో 4.66 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 21.000 కోట్ల) ఎఫ్‌డీఐ లు వచ్చాయి. గత 11 ఏళ్లలో రెండో అత్యధిక నెలవారీ పెట్టుబడులు ఇవే కావడం గమనార్హం. గతేడాది మేలో ఎఫ్‌డీఐ విలువ 2.21 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10,000 కోట్లు) మాత్రమే కావడం గమనార్హం.
జులై 8 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఎగుమతులు 45.7 శాతం వృద్ధితో 7,900 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3,55,500 కోట్లకు) చేరాయి. జూన్ నెలకు 46.4 శాతం పెరిగి 2,920 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
¤ ఏప్రిల్-జూన్ నెలలకు దిగుమతులు 36.2 శాతం పెరిగి 11060 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 3,160 కోట్ల డాలర్లకు చేరింది. జూన్ నెలకు దిగుమతులు 3,690 కోట్ల డాలర్లకు చేరాయి.
జులై 12 
¤ ఆర్థిక వ్యవస్థలో మందగతి ఛాయలను ప్రతిబింబిస్తూ పారిశ్రామిక వృద్ధి (ఐఐపీ) మే నెలలో 5.6 శాతానికి పడిపోయింది. గత సంవత్సరం మే నెలలో ఇది 8.5 శాతంగా ఉండటం గమనార్హం. తాజా అంకెలు తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయిని సూచిస్తున్నాయి. ముఖ్యంగా వస్తూత్పత్తి, గనుల తవ్వకం రంగాల పేలవ ప్రదర్శన ఇందుకు దారి తీసింది.
జులై 14 
¤ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్ఒ)కి చెందిన రూ.3.5 లక్షల కోట్ల నిధి నిర్వహణ కోసం ఎస్‌బీఐ సహా నాలుగు సంస్థలను ఫండ్ మేనేజర్లుగా నియమించాలని నిర్ణయించారు. ఎస్‌బీఐ కాకుండా ఇతర సంస్థల్లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ప్రైమరీ డీలర్‌షిప్, రిలయన్స్ కేపిటల్, హెచ్ఎస్‌బీసీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉన్నాయి.
¤ ఎంపికైన సంస్థలు సెప్టెంబరు 1 నుంచి మూడేళ్ల పాటు ఈపీఎఫ్ఓ నిధుల నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తాయి.
జులై 20 
¤ గోధుమలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరడంతో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కొత్త రికార్డును నమోదుచేసింది. 2009-10 ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 21.81 కోట్ల టన్నులు ఉండగా 2010-11 (జులై-జూన్)కి 24.16 కోట్ల టన్నులకి చేరినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి పి.కె.బసు తెలిపారు. వర్షాలతో పాటు ఇతర పరిస్థితులు అనుకూలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 24.5 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధ్యమేనన్నారు.
¤ గత ఏడాదితో పోలిస్తే 2010-11లో ధాన్యం ఉత్పత్తి 890.9 లక్షల టన్నుల నుంచి 953.2 లక్షల టన్నులకి చేరింది. గోధుమల ఉత్పత్తి 808 లక్షల టన్నుల నుంచి 859.3 లక్షల టన్నులకు పెరిగింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 180.9 లక్షల టన్నులకు చేరింది.
జులై 26 
¤ రిజర్వు బ్యాంకు వృద్ధిరేటు అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా తొలి త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ముంబయిలో ప్రకటించింది.
పరపతి విధాన సమీక్ష ప్రధానాంశాలు:
¤ రెపో రేటు 7.5 శాతం నుంచి 8 శాతానికి పెంపు.
¤ 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగిన రివర్స్ రెపోరేటు
¤ బ్యాంకురేటు, నగదు నిల్వల నిష్పత్తిలో మార్పు లేదు. ఈ రెండూ 6శాతం వద్దే ఉంటాయి.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలు 6 నుంచి 7 శాతానికి పెంపు
¤ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరమైన చర్యలు కొనసాగుతాయి.
¤ 2011-12 ఏడాదికి 8 శాతం వృద్ధిరేటు పునరుద్ఘాటన
¤ మార్జినల్ స్టాండింగ్ సౌకర్యం కింద బ్యాంకులు అప్పటికప్పుడు పొందే రుణాలపై వడ్డీ రేటు 9 శాతం
¤ మధ్యంతర సమీక్ష సెప్టెంబరు 16న, రెండో త్రైమాసిక సమీక్ష అక్టోబరు 25న నిర్వహించనున్నారు.
జులై 29 
¤ హీరో హోండా నుంచి హోండా వైదొలగిన నేపథ్యంలో పేరును హీరో మోటోకార్ప్‌గా మార్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
¤ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ బ్రిజ్ మోహన్ ముంజాల్  
 

No comments:

Post a Comment