¤ భారత ఎగుమతులు అక్టోబరులో కేవలం 10.8 శాతం మేర పెరిగి, 19.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత రెండేళ్లలో అతి తక్కువ స్థాయి కావడం గమనార్హం.
¤ అక్టోబరులో దిగుమతులు 21.7 శాతం మేర వృద్ధి చెంది, 39.5 బిలియన్ డాలర్ల మేరకు నమోదయ్యాయి. ఫలితంగా విదేశీ వాణిజ్య లోటు 19.7 బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది. గత నాలుగు సంవత్సరాల్లో ఇది అత్యధికం. ¤ ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య ఎగుమతులు మొత్తం 179.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 45.9 శాతం వృద్ధిని సూచిస్తోంది. దిగుమతులు అదే ఏడు నెలల కాలంలో 30.9 శాతం మేరకు పెరిగి 273.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 93.7 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
¤ రాష్ట్ర అప్పులు 2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,32,805 కోట్లకు చేరాయి. 2007-08 కి ఈ రుణం రూ.97వేల కోట్లు కాగా, 2008-09 కి రూ.1.06 లక్షల కోట్లు, 2009-10 కి రూ1.19 లక్షల కోట్లకు చేరింది.
¤ దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పు రూ.17.83 లక్షల కోట్లు కాగా రూ.2.24 లక్షల కోట్ల అప్పుతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌పై రూ.2.23 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్‌పై రూ.1.90 లక్షల కోట్లు, గుజరాత్ పై రూ.1.36 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ వరుసలో మన రాష్ట్రం అయిదో స్థానాన్ని ఆక్రమించింది. ¤ ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా పార్లమెంటులో ఈ వివరాలు వెల్లడించారు.
¤ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కింద ఏడాదికి రూ.లక్ష వరకూ డిపాజిట్లను అనుమతించాలని బ్యాంకులను రిజర్వు బ్యాంకు కోరింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని 25 బ్యాంకులు పీపీఎఫ్ పథకం కింద డిపాజిట్లను స్వీకరిస్తున్నాయి.
¤ పీపీఎఫ్ వార్షిక పొదుపు పరిమితిని ఇటీవల ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. వడ్డీ రేటును కూడా 8 శాతం నుంచి 8.6 శాతానికి సవరించింది. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వడ్డీరేటు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలలకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2,35,333 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలం వసూళ్లు రూ.2,16,628 కోట్లతో పోలిస్తే 8.63 శాతం పెరిగాయి. ¤ ఏప్రిల్- నవంబరు నెలల్లో స్థూల పన్ను వసూళ్లు 19.56 శాతం పెరిగి, రూ.2,54,268 కోట్ల నుంచి రూ.3,04,002 కోట్లకు చేరాయి. ఈ కాలంలో ఆదాయపు పన్ను విభాగం రూ.68,669 కోట్లను రిఫండ్ చేసింది. ¤ ఏప్రిల్- నవంబరు నెలలకు స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.61 శాతం పెరిగి రూ.1,66,638 కోట్ల నుంచి రూ. 1,99,317 కోట్లకు, నికర వసూళ్లు 5.65 శాతం పెరుగుదలతో రూ.1,46,279 కోట్లకు చేరాయి. ¤ స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 19.44 శాతం వృద్ధితో రూ.1,04,176 కోట్లకు, నికర వసూళ్లు 14 శాతం పెరుగుదలతో రూ.88,567 కోట్లకు పెరిగాయి.
¤ అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురవడంతో నవంబరు నెలలో భారత ఎగుమతులు 22.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. దిగుమతులు మాత్రం 35.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
¤ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ - నవంబరు) దేశ ఎగుమతులు 192.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 309.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 116.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో పరోక్ష పన్ను వసూళ్లు 16.8 శాతం వృద్ధితో రూ.2,52,544 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-నవంబరులో ఎక్సైజ్ సుంకాల వసూళ్లు రూ.94,441 కోట్లకు చేరుకున్నాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు రూ.1,00,062 కోట్లుగా నమోదయ్యాయి. డిసెంబరు 11 ¤ గెయిల్ ఇండియా 20 సంవత్సరాల పాటు ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జీ) కొనుగోలుకు అమెరికా సంస్థ సబైన్‌పాస్ లిక్విఫాక్షన్ ఎల్ఎల్‌సీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటా 3.5 మిలియన్ టన్నుల చొప్పున ఎల్ఎన్‌జీని ఇరవై ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది.
¤ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు పరిశ్రమలను దెబ్బతీయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) అనూహ్యరీతిలో పతనమైంది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది అక్టోబరులో ఐఐపీ 5.1 శాతం వ్యతిరేక వృద్ధిని నమోదు చేసింది.
¤ 2010 అక్టోబరులో ఐఐపీ, అంతకు ముందు ఏడాది అక్టోబరుతో పోల్చినపుడు 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ, ఈ ఏడాది అక్టోబరులో మాత్రం, 2010 అక్టోబరుతో పోల్చినపుడు మైనస్ 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
¤ రిజర్వ్ బ్యాంకు మధ్యంతర పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. ద్రవ్యోల్బణ కట్టడి కోసం మార్చి 2010 నుంచి 13 సార్లు కీలక రేట్లను పెంచిన రిజర్వు బ్యాంకు ఈసారి రేట్లలో ఏ మార్పూ చేయలేదు.
¤ దీంతో రెపో రేటు 8.5 శాతం, రివర్స్ రెపో 7.5 శాతం, సీఆర్ఆర్ 6 శాతం వద్దే ఉండిపోయాయి.
¤ రాష్ట్రాల తలసరి ఆదాయాలను ప్రణాళికా సంఘం విశ్లేషించింది. రాష్ట్రంలో 2010-11లో తలసరి ఆదాయం రూ.60,458గా తేలినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2010-11లో దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం రూ.54,835.
¤ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువ హోదాను భారత స్టాక్ మార్కెట్ కోల్పోయింది. రూపాయి క్షీణత వల్ల స్క్రిప్‌ల ధరలు పతనం కావడంతో మార్కెట్ విలువ 994.97 బిలియన్ డాలర్ల (రూ.52,60,440.78 కోట్ల) కు పరిమితమైంది.
¤ 2010-11లో రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు రూ.35,022 కోట్లకు చేరాయి. 2009-10 ఎగుమతులు రూ.33,482 కోట్లతో పోలిస్తే 4.6 శాతం వృద్ధి లభించింది. దేశీయ ఐటీ రంగంలో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2010-11లో దేశీయ ఐటీ ఎగుమతులు రూ.2,52,374 కోట్లలో రాష్ట్రవాటా 13.9 శాతం.
¤ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో జరిగిన మొత్తం ఎగుమతులు రూ.91,614 కోట్లలో ఐటీ వాటా 38.22 శాతం. రాష్ట్రంలో 2010లో 44 కొత్త ఐటీ యూనిట్లు ఏర్పాటవగా, 2011లో కొత్తగా నెలకొల్పినవి 46. |
economy current affairs in telugu
Monday, July 21, 2014
డిసెంబరు 2011 - ఆర్థికరంగం
నవంబరు 2011 - ఆర్థికరంగం
¤ డిపాజిట్ చేసిన మొత్తం రెట్టింపు అయ్యేవిధంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 'డబుల్ పేరుతో సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం 87 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇది 13.84% రాబడికి సమానం.
¤ అదే సీనియర్ సిటిజన్స్‌కైతే కేవలం 83 నెలల్లో రెట్టింపు అవుతుంది.వీరికి 14.56% రాబడి లభించనుంది. ¤ కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.10,000 ఆ పైన రూ.1,000 చొప్పున గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
¤ 2010-11 ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 341 లక్షల టన్నుల సేకరణ జరగ్గా, అందులో 96.10 లక్షల టన్నులను ఒక్కఆంధ్రప్రదేశే సేకరించింది. 86.34 లక్షల టన్నులతో పంజాబ్ రెండో స్థానంలో, 37.40 లక్షల టన్నులతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో నిలిచాయి.
¤ రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 1983-84 నుంచి 2010-11 వరకు ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం రుణం రూ. 10,696 కోట్లు.
¤ ఆంధ్రప్రదేశ్‌కున్న మొత్తం రుణ బాధ్యతల్లో ప్రపంచ బ్యాంకు వాటా7.82 శాతం మాత్రమే కావడం గమనార్హం. ¤ ఐబీఆర్‌డీ( అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు), ఐడీఏ(అంతర్జాతీయ అభివృద్ధి సంఘం) ద్వారా రెండు రకాల అప్పులను ప్రపంచ బ్యాంకు ఇస్తోంది. మధ్య తరహా ఆదాయం గల దేశాలకు ఐబీఆర్‌డీ ద్వారాను, పేద దేశాలకు ఐడీఏ ద్వారా రుణాలు అందుతాయి. ఐబీఆర్‌డీ ద్వారా ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం 6.94% వడ్డీతో పాటు మరికొన్ని రుసుములు కూడా ఉండగా, ఐడీఏ రుణానికి మాత్రం వడ్డీకి బదులు స్వల్పంగా ఇతర రుసుములే ఉంటాయి. రాష్ట్రానికి ఈ రెండు రకాలుగానూ రుణాలు అందుతున్నాయి. మొదటి రకం రుణాన్ని 20 ఏళ్లలోను, రెండో రకం రుణాన్ని 35 ఏళ్ల వ్యవధిలోను చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
¤ యూరో జోన్ సంక్షోభ ప్రభావం మన ఎగుమతులపై పడింది. భారత ఎగుమతులు అక్టోబరులో 19.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఖరీదైన ముడి చమురు కారణంగా దిగుమతులు 39.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో వాణిజ్య లోటు 19.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
¤ జూలైలో 82% వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు ఆగస్టులో 44.25 శాతం, సెప్టెంబరులో 36.36%, అక్టోబరులో 10.8% మేర పెరుగుతూ వచ్చాయి. ఏరంగంలో చూసినా గత మూడు నెలల్లో ఇది తక్కువ వృద్ధి అని వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లార్ పేర్కొన్నారు. ¤ ఆర్థిక వ్యవస్థ మందగించడం, కొద్ది నెలల క్రితం పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వంటి కారణాలతో అక్టోబరు నెలకు పరోక్ష పన్ను వసూళ్లు 2.5 శాతం తగ్గి రూ. 30,278 కోట్లకు పరిమితమయ్యాయి. ¤ ఏడాది క్రితం ఇదే నెలలో ఈ వసూళ్లు రూ. 31,058 కోట్లు ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పరోక్ష పన్ను వసూళ్లలో కస్టమ్స్, ఎక్సైజ్, సేవల పన్ను ఆదాయం ఉంటుంది. ¤ అక్టోబరు నెలకు కస్టమ్స్ పన్ను వసూళ్లు 11.6 శాతం తగ్గి రూ. 12,849 కోట్ల నుంచి రూ. 11,357 కోట్లకు పరిమితమయ్యాయి. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం వసూళ్లు 5.3 శాతం తగ్గి రూ. 10,527 కోట్లకు చేరాయి. సేవల పన్ను వసూళ్లు మాత్రం 18.4 శాతం పెరిగి రూ. 7,089 కోట్ల నుంచి రూ. 8,394 కోట్లకు పెరిగాయి.
¤ భారత బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలా'నికి సవరించనట్టు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ప్రకటించింది.
¤ ''మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇక్కడి బ్యాంకుల ఆస్తుల, మూలధనం, లాభాదాయకతలపై ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపై అంచనాలను సవరించాం" అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, విశ్లేషకుడు వినీత్ గుప్తా ప్రకటించారు. ¤ ''బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను తగ్గించినప్పటికీ స్థిరంగా డిపాజిట్లు సమకూర్చే ఖాతా దారులు, ప్రభుత్వ వాటా బ్యాంకులకు సానుకూల అంశాలు. ఈ రెండూ బ్యాంకులకు నిధుల కొరత రానివ్వవు. ఒడుదొడుకులు కలిగించే అస్థిరత్వం నుంచి బ్యాంకులను కాపాడతాయని మూడీస్ పేర్కొంది. ¤ గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రేటింగ్‌ను మూడీస్ తగ్గించిన విషయం తెలిసిందే. దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు మూడీస్ రేటింగ్ ఇస్తోంది 20011 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆస్తుల్లో వీటి వాటా దాదాపు 66 శాతం ఉంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే పై చేయి.
¤ ప్రముఖ రేటింగ్స్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ & పీ) భారతీయ బ్యాంకింగ్ రంగానికి రేటింగ్‌ను మెరుగు పరచింది. ఈ సంస్థ భారత బ్యాంకింగ్ రంగంలో రిస్క్ ప్రొఫైల్ (బ్యాంకింగ్ ఇండస్ట్రీ) కంట్రీ రిస్క్ అసెస్‌మెంట్స్- బైక్రా)ను ఒక అంచె మేరకు పెంచి 'గ్రూప్ 6' నుంచి 'గ్రూప్ 5' కు చేర్చింది.
¤ మరో రేటింగ్ సంస్థ 'మూడీస్ ఒక రోజు క్రితమే భారతీయ బ్యాంకింగ్ రంగ అవుట్‌లుక్ ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలానికి' జార్చిన విషయం విదితమే. ¤ (బైకా) గ్రూప్5లో ఉన్న ఇతర దేశాలలో చైనా, పోర్చుగల్, థాయ్‌లాండ్, టర్కీలు ఉన్నాయి.
¤ యూనియన్ బ్యాంక్ తమ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా 111 కొత్తశాఖలను ప్రారంభించింది. 11-11-2011 తేదీని పురస్కరించుకొని 111 కొత్తశాఖలను ప్రారంభించింది.
¤ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొవాలని, దక్షిణాసియా అంతటా ఆంక్షలులేని సరళీకృత వాణిజ్య విధానాలను తీసుకురావాలని సార్క్ సదస్సు తీర్మనించింది. ¤ రెండు రోజుల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సార్క్ దేశాలు సంయుక్తంగా ''అద్దూ ప్రకటన" పేరుతో ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. సార్క్‌దేశాలు మధ్య రైల్వే, నౌక మోటారు వాహనాల రాకపోకలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన పేర్కొంది. ¤ మరో వైపు, ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పదించే వ్యవస్థ ఏర్పాటు, విత్తనాల బ్యాంకును నెలకొల్పడం, మత్తుపదార్థాలు, వ్యక్తుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తదితర అంశాలతో కూడిన సార్క్ ఒప్పందంపై సార్క్ దేశాధినేతలు సంతకాలు చేశారు. ¤ ప్రధాని మన్మోహాన్ సింగ్ నేపాల్ ప్రధాని బాబూరాం భట్టారాయ్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు.
¤ స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల బ్రాండ్ ఫావ్రే లూబాను 2 మిలియన్ యూరోల (రూ.13 కోట్ల) తో టైటన్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. 1737లో స్థాపించిన ఫ్రావ్రే లూబాకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్ర ఉంది.
¤ విశాఖపట్నంలో రూ. 11,196 కోట్ల పెట్టుబడితో భారీ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌కు చెందిన అమెరిండ్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
¤ ఈ ప్రాజెక్టును పెట్రోలియం కెమికల్స్ పెట్టుబడుల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం విశాఖజిల్లా అచ్యుతాపురంలో వెయ్యి ఎకరాల భూమితోపాటు మెగా ప్రాజెక్టు కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ¤ రాష్ట్రంలో ఏర్పాటయ్యే మొట్టమొదటి ప్రైవేటు రిఫైనరీ ఇదేనని, దీనిద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నులు, సర్‌ఛార్జి రూపేణా రూ. 15,444 కోట్ల ఆదాయం వస్తుందని, ఒక్క రాష్ట్రానికైతే రూ. 7,122 కోట్ల ఆదాయం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి చెప్పారు. ¤ ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ, కార్పొరేట్ బాండ్లలోనూ విదేశీ సంస్థాగత మదుపుదార్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల పరిమితిని చెరి 5 బిలియన్ డాలర్ల (రూ. 25 వేల కోట్లు) మేర పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. భారత కార్పొరేట్లకు వనరుల లభ్యతను పెంచడంతోపాటు దేశానికి మూలధన నిధుల ప్రవాహాన్ని ఇది అధికం చేయగలదు. ¤ తాజా నిర్ణయంతో ఎఫ్ఐఐలు ఇకపై ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టవచ్చు. ¤ కాగా, దీర్ఘకాల మౌలిక బాండ్లలో పెట్టుబడులు పరిమితిలో ఎలాంటి మార్పు లేకుండా 25 బిలియన్ డాలర్ల వద్దే ఉంచారు. ¤ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరిమితి రూ. 43,650 కోట్లు కాగా అక్టోబరు 31, 2011 నాటికి వారు రూ. 41,253 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇదేవిధంగా కార్పొరేట్ బాండ్లలో పరిమితి రూ. 74,416 కోట్లు ఉండగా గత నెలాఖరు నాటికి రూ. 68,289 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
¤ రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.52.16 ధరకు పడిపోయింది. గత 33 నెలల కాలంలో ఇదే కనిష్ఠ ధర (2009 మార్చి 12న రూ. 52.20గా నమోదైంది). ఈ ఏడాది ఆగస్టు 2న రూపాయి మారకం విలువ రూ.44.07 కాగా అప్పట్నుంచే విలువ క్షీణత మొదలై ఇప్పుడు కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
¤ రూపాయి పతనానికి ప్రధాన కారణం అమెరికా, ఐరోపా దేశాల్లో నెలకొని ఉన్న అననుకూల ఆర్థిక వాతావరణమే. అప్పులు కట్టలేక గ్రీస్ చేతులెత్తేయటం, రెండు ఫ్రెంచ్ బ్యాంకుల రేటింగ్ తగ్గిపోవడంతో ఐరోపా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో యూరో విలువ క్షీణించి, డాలర్ బలపడింది. ఇదే ప్రభావం ఇతర దేశాలపై పడి ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఈ పరిస్థితులే రూపాయి మీద కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో స్టాక్ మార్కెట్ల నుంచి మదుపుదార్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సర్వసాధారణం. ¤ ఇక మన దేశంలో సమస్యలు భిన్నంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కుంగదీస్తోంది. ఎన్నో నెలల నుంచి ఇది తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో వడ్డీరేట్లు పెరిగాయి. సరకులు, ముడి పదార్థాలు ఖరీదైపోయాయి. తత్ఫలితంగా పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఎగుమతులు పడిపోయాయి. అదే సమయంలో అధిక దిగుమతులు తప్పడం లేదు. దీనివల్ల వాణిజ్య లోటు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దిగుమతులకు పెద్ద ఎత్తున డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో మన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (విదేశీ మారక నిల్వ) తరిగిపోతోంది. మరో పక్క అధిక ముడిచమురు ధర వేధిస్తూనే ఉంది. ఇంటా బయటా అన్ని పరిస్థితులూ ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయి రూపాయి మారకం విలువ వేగంగా క్షీణిస్తోంది. ¤ రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం ఎంతో అవసరం. ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనయ్యే పక్షంలో ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. పెరిగినా, తగ్గినా దిగుమతులు - ఎగుమతులు ఖరీదైపోతాయి. సంబంధిత రంగాల్లోని సంస్థలకు ఇబ్బందులే. రూపాయి విలువ గణనీయంగా క్షీణించిన ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతి చేసుకునే మందులు, నిత్యావసర వస్తువులు, నూనెలు, ఎరువులు ఖరీదైపోతున్నాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి చేసుకోవడం కష్టమైపోతుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ పరిస్థితి పెను భారమే. రూపాయి బలహీనత వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి, పరోక్షంగా సామాన్యులకు దీని వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.6 శాతానికి పరిమితం కావచ్చని ప్యారిస్‌కు చెందిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అనే సంస్థ అంచనా వేసింది. ఓఈసీడీలో 34 దేశాలకు సభ్యత్వం ఉంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంది.
¤ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2004-05 నుంచి 2010-11 వరకు నమోదైన వృద్ధి రేట్లను ప్రణాళిక సంఘం తాజాగా విశ్లేషించింది. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల సగటు 8.71 శాతంగా తేలింది. జాతీయ సగటు (8.45 శాతం) కంటే ఇది కొంచెం ఎక్కువ. ఇదే సమయంలో 17 రాష్ట్రాల్లో 8.73 నుంచి 13.19 శాతం వరకు వృద్ధి కనిపించింది.
¤ 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో సగటున 10 శాతం వృద్ధిని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. గత ఏడేళ్లలో సగటు వృద్ధి రేటు 8.71 శాతం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో తన లక్ష్య సాధనకు ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
¤ అంతర్జాతీయ ఆర్థిక ఒడుదొడుకులతో నలిగిపోతున్న ప్రపంచ బ్యాంకింగ్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా 15 బ్యాంకుల రేటింగ్‌ను స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) తగ్గించింది. వీటిలో అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో బ్యాంకులు ఉన్నాయి. ఐరోపా దిగ్గజ బ్యాంకులు హెచ్ఎస్‌బీసీ, లాయిడ్స్, బ్యాంకింగ్ గ్రూప్, ఆర్‌బీఎస్ (రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్) రోబో బ్యాంక్, బార్‌క్లాస్ రేటింగ్‌లను కూడా ఎస్ అండ్ పీ తగ్గించింది.
¤ బీఎస్‌పీ పారిబస్, క్రెడిట్ అగ్రికోల్, డాయిష్ బ్యాంకుల రేటింగ్‌లను యథాతథంగా కొనసాగించింది. ¤ ప్రపంచ వ్యాప్తంగా 37 బ్యాంకుల రేటింగ్‌ను సమీక్షించిన ఎస్ అండ్ పీ చైనాకు చెందిన బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకుల రేటింగ్‌లను పెంచడం విశేషం. సమీక్షించిన బ్యాంకుల్లో భారత బ్యాంకులు లేవు. ¤ ప్రపంచ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - పరిశోధన అభివృద్ధి) రంగంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీలతో యూరోపియన్ కమిషన్ (ఈసీ) రూపొందించిన జాబితాలో 18 భారతీయ కంపెనీలు చోటు పొందాయి. వీటిలో భారతీయ దిగ్గజాలన్నింటినీ తోసిరాజని టాటా మోటర్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, సృజనాత్మక కార్యకలాపాలపై భారీ పెట్టుబడుల ప్రాతిపదికగా ఈ జాబితాను రూపొందించారు. తర్వాతి స్థానాల్లో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్, పొలారిస్ సాఫ్ట్‌వేర్, బిహెచ్ఇఎల్ మహీంద్రా అండ్ మహీంద్రాలు నిలిచాయి. ¤ భారతీయ కంపెనీల జాబితాలో తర్వాతి స్థానాల్లో కేపీఐటీ కమిన్స్ ఇన్ఫో (6), జైలాగ్ సిస్టమ్స్ (7), డాక్టర్ రెడ్డీస్(8), లుపిన్(9), ఇన్ఫోసిస్ (10), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11), కోర్ ప్రాజెక్ట్స్ (12), భారత్ ఎలక్ట్రానిక్స్ (13), అశోక్ లేల్యాండ్ (14), సిప్లా (15), సన్ ఫార్మా (16), ఓఎన్‌జీసీ (17), ఎఫ్‌సిఎస్ సాఫ్ట్‌వేర్ (18) ఉన్నాయి. ¤ గ్లోబల్ ఆర్ ఆండ్ డి జాబితాలో మాత్రం టాటా మోటార్స్ ర్యాంకు 264 కావడం గమనార్హం. మిగిలిన 17 భారత కంపెనీలు 300 నుంచి 1400 ర్యాంకుల మధ్యలో ఉన్నాయి. ¤ గ్లోబల్ టాప్-5 కంపెనీల జాబితాలో మూడు ఫార్మా కంపెనీలే. స్విస్ ఫార్మా దిగ్గజం రోచ్ జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ రెండో స్థానంలో నిలిచింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడో స్థానాన్ని పొందింది. జపనీస్ ఆటో దిగ్గజం టొయోటో నాలుగో స్థానం, ఔషధ కంపెనీ మెర్క్ అయిదో స్థానాన్ని పొందాయి. ¤ కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) ప్రకటించిన వృద్ధి గణాంకాల ప్రకారం జులై - సెప్టెంబరు కాలానికి భారత వృద్ధి 6.9 శాతంగా నమోదైంది (గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ వృద్ధి 8.4%). ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్‌లో వృద్ధిరేటు 7.7 శాతం నమోదైంది. ¤ ప్రభుత్వం వెలువరించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో జీడీపీ 7.3%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఆరు నెలల కాలంలో వృద్ధి 8.6%గా ఉంది. ¤ 2011-12 తొలి ఏడు నెలల్లో భారత ద్రవ్యలోటు రూ. 3.07 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం రూ.4.128 లక్షల కోట్లలో ఇది 74.4 శాతానికి సమానం. ¤ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్- అక్టోబరులో మొత్తం పన్ను వసూళ్లు 18% వృద్ధితో రూ.3.73 లక్షల కోట్లుగా నమోదు కాగా, ప్రభుత్వ వ్యయాలు 10% వృద్ధితో రూ.6.804 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో ద్రవ్యలోటు రూ.3.07 లక్షల కోట్లకు చేరింది. |
అక్టోబరు 2011 - ఆర్థికరంగం
¤ బ్యాంక్ ద్రవ్య సామర్థ్య రేటింగ్ (బీఎఫ్ఎస్ఆర్)ను 'సి- నుంచి 'డి+కు సవరించినట్టు వెల్లడించింది.
¤ ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను 8 శాతం నుంచి 7.6 శాతానికి సవరించారు. |
సెప్టెంబరు 2011 - ఆర్థికరంగం
¤ ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఎస్‌బీఐ, బీఎస్‌పీ పారిబస్‌ల (74:26) సంయుక్త సంస్థే ఇది. 'హాస్పిటల్ క్యాష్ అనే పేరుతో పథకాన్ని ప్రకటించింది. దీనికింద బీమా తీసుకున్న వ్యక్తికి ఆసుపత్రి బిల్లుతో సంబంధం లేకుండా ఆసుపత్రి పాలైన ప్రతీ రోజుకు ఒక స్థిర మొత్తాన్ని అందజేస్తారు. ఈ పథకం ప్రకారం పాలసీ టర్మ్ మూడేళ్లుగా ఉంటుంది.
¤ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు 'స్విఫ్ట్ పేరుతో వ్యక్తిగత రుణాలకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఖాతాదారుడి నుంచి అన్ని పత్రాలు అందుకున్న 24 గంటల్లో (వర్కింగ్ అవర్స్) మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది.
¤ ఆరోగ్య సంరక్షణకు 12వ ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2012-17 కాలానికి ఆరోగ్య సంరక్షణ రంగంపై వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచనున్నట్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది దాదాపు ఒక శాతంగా ఉంది.
¤ దేశ పారిశ్రామిక వృద్ధి జూలైలో కేవలం 3.3 శాతానికి పరిమితమై నిరుత్సాహపరిచింది. గత 21 నెలల్లో ఇదే కనిష్ఠస్థాయి, యంత్ర పరికరాలు వస్తూత్పత్తి గనుల తవ్వకం రంగాల పేలవమైన పనితీరు పారిశ్రామికవృద్ధి నమోదైంది. 2010 జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ 9.9 శాతం వృద్ధి చూపింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తగ్గించింది. గతంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేయగా దీన్ని తాజాగా 7.9 శాతానికి పరిమితం చేసింది.
¤ 2012 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగలదని పేర్కొంది. గతంలో ఇది 7.8 శాతానికి తగ్గగలదని అంచనా వేసింది. ¤ ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో ఆసియాలోని వర్థమాన దేశాలు ఊహించినదానికన్నా తక్కువ వృద్ధిరేటును నమోదు చేయనున్నామని ఏడీబీ వెల్లడించింది. ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలు సగటున ఈ ఏడాది (2011) 7.8 శాతం వృద్ధి చెందగలవని ఏప్రిల్‌లో అంచనా వేయగా దీన్ని 7.5 శాతానికి తగ్గించింది. 2012 ఏడాది వృద్ధిరేటును 7.7 శాతం నుంచి 7.5 శాతానికి సవరించింది.
¤ ఆస్ట్రేలియాలో 3 బొగ్గు గనులతో పాటు ఒక రైల్వే లైను, నౌకాశ్రయం ప్రాజెక్టులభాగస్వామ్యానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవీకే గ్రూపు ప్రకటించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ నెలల మధ్య) రాష్ట్రస్థూల ఉత్పత్తి 8.49 శాతం వృద్ధి రేటు నమోదయింది. ఇదే వ్యవధిలో జాతీయస్థాయిలో 7.74 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. ¤ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమల రంగాలు జాతీయ స్థాయి కంటే అధిక ప్రగతినికనబరిచాయి. సేవారంగం మాత్రం వెనుకబడింది. వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు10.83 శాతం కాగా జాతీయ స్థాయి వృద్ధిరేటు 3.93గా నమోదయింది. రాష్ట్రంలోపరిశ్రమల రంగం వృద్ధిరేటు 7.52 శాతం కాగా, జాతీయ స్థాయిలో 5.10 శాతంవృద్ధిరేటు నమోదు అయింది. ఇక సేవల రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు 8.57 శాతం,జాతీయ స్థాయి వృద్ధిరేటు 10 శాతం. ¤ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లోకలిపి రూ.74,509 కోట్ల విలువైన ఉత్పత్తులు ఉన్నట్లు అర్థ గణాంక శాఖ అంచనావేసింది. గత ఏడాది ఇదే వ్యవధిలో వీటి విలువ రూ.68,681 కోట్లు. ¤ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మధ్యంతర పరపతి విధాన సమీక్షనుముంబయిలో ప్రకటించారు. ¤ పారిశ్రామిక వర్గాలు, బ్యాంకర్లు ఊహించిన విధంగానే నగదు లభ్యతను మరింతతగ్గించడానికి ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేటైన రెపో రేటును పావు శాతం పెంచి8.25 శాతానికి సవరించింది. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 0.25 శాతం పెరిగి7.25 శాతం అవుతుంది. ¤ ఈసారి కూడా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), చట్టపరమైన లిక్విడిటీ నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) వంటి ఇతర సాధనాల జోలికి కేంద్ర బ్యాంకు పోకపోవడం గమనార్హం.దాదాపు గత ఏడాదిన్నర కాలంలో కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచడం ఇదిపన్నెండోసారి. ¤ అయితే వడ్డీ రేట్లు ఇంతగా పెంచుతున్నా ద్రవ్యోల్బణం మాత్రం ఎక్కడా తగ్గుముఖంపడుతున్న దాఖలాలు లేక పోవడం ఆందోళనకరమైన అంశం. గత 13 నెలల కాలంలోనెలవారీగా ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తే, ఇది 8.20 నుంచి 9.78 శాతం మధ్యనమోదవుతూ వచ్చింది. అంటే పెద్ద మార్పు లేకుండా స్థిరంగా 8 - 9.8 శాతం ఉంటూవస్తున్నట్లు స్పష్టమౌతోంది. అదే సమయంలో రెపో, రివర్స్‌రెపో రేట్లు దాదాపు 4శాతం నుంచి 8.25 శాతం వరకూ పెరిగాయి. అయినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గలేదంటేకేవలం నగదు సరఫరా మాత్రమే కాదు... ఇంకా బలమైన కారణాలేవో పనిచేస్తున్నాయనే భావించాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకిరావాలంటే సరకుల సరఫరా గణనీయంగా పెరగాలని, మరోదారి లేదని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ¤ ఏదేమైనప్పటికీ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్యప్రజానీకం పై పెనుభారం పడుతోంది రుణాలు తీసుకుని ఇళ్లు, వాహనాలు కొనుగోలుచేసిన వారు, బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు అదనపు వడ్డీ భారాన్నిమోయలేక సతమతం అవుతున్నారు. మరోపక్క మండిపోతున్న నిత్యావసరాలు,కూరగాయల ధరలు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న దాఖలాలే లేవని స్పష్టంచేస్తున్నాయి. ఇదే సమయంలో చమురు ధరలను పెంచుతూ ప్రభుత్వం ప్రజలపైమరింత భారాన్ని మోపుతోంది. రెపో, రివర్స్ రెపో రేట్లు గత 12 దఫాలుగా పెరిగిన తీరు బేసిక్ పాయింట్లలో తేదీ రెపోరేటు రివర్స్‌రెపో రేటు 19 మార్చి 2010 25(5.00) 25(3.50) 20 ఏప్రిల్ 2010 25(5.25) 25(3.75) 02 ఆగస్టు 2010 25(5.50) 25(4.00) 27 ఆగస్టు 2010 25(5.75) 50(4.50) 02 సెప్టెంబరు 2010 25(6.00) 50(5.00) 02 నవంబరు 2010 25(6.25) 25(5.25) 25 జనవరి 2011 25(6.50) 25(5.50) 17 మార్చి 2011 25(6.75) 25(5.75) 03 మే 2011 50(7.25) 50(6.25) 16 జూన్ 2011 25(7.50) 25(6.50) 26 జులై 2011 50(8.00) 50(7.00) 16 సెప్టెంబరు 2011 25(8.25) 25(7.25) ¤ రెపోరేటు: స్వల్ప కాలిక సర్దుబాటు నిమిత్తం ఆర్‌బీఐ నుంచి తీసుకున్న సొమ్ముపైబ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీరేటు. ¤ రివర్స్ రెపో రేటు: బ్యాంకులు తమ వద్దనున్న మిగులు సొమ్మును ఆర్‌బీఐ వద్దపెట్టినపుడు లభించే వడ్డీరేటు. ¤ తదుపరి సమీక్ష అక్టోబరు 25న జరుగుతుంది.
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన 12 ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖఆమోదించింది. విటి విలువ రూ.242.88 కోట్లు.
|
ఆగస్టు -2011 ఆర్థికరంగం
|
Subscribe to:
Comments (Atom)