Monday, July 21, 2014

సెప్టెంబరు 2011 - ఆర్థికరంగం

సెప్టెంబరు 5 
¤ ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఎస్‌బీఐ, బీఎస్‌పీ పారిబస్‌ల (74:26) సంయుక్త సంస్థే ఇది. 'హాస్పిటల్ క్యాష్ అనే పేరుతో పథకాన్ని ప్రకటించింది. దీనికింద బీమా తీసుకున్న వ్యక్తికి ఆసుపత్రి బిల్లుతో సంబంధం లేకుండా ఆసుపత్రి పాలైన ప్రతీ రోజుకు ఒక స్థిర మొత్తాన్ని అందజేస్తారు. ఈ పథకం ప్రకారం పాలసీ టర్మ్ మూడేళ్లుగా ఉంటుంది. 
సెప్టెంబరు 9 
¤ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు 'స్విఫ్ట్ పేరుతో వ్యక్తిగత రుణాలకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఖాతాదారుడి నుంచి అన్ని పత్రాలు అందుకున్న 24 గంటల్లో (వర్కింగ్ అవర్స్) మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది.
¤ ఆరోగ్య సంరక్షణకు 12వ ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2012-17 కాలానికి ఆరోగ్య సంరక్షణ రంగంపై వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచనున్నట్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది దాదాపు ఒక శాతంగా ఉంది. 
సెప్టెంబరు 12 
  ¤ దేశ పారిశ్రామిక వృద్ధి జూలైలో కేవలం 3.3 శాతానికి పరిమితమై నిరుత్సాహపరిచింది. గత 21 నెలల్లో ఇదే కనిష్ఠస్థాయి, యంత్ర పరికరాలు వస్తూత్పత్తి గనుల తవ్వకం రంగాల పేలవమైన పనితీరు పారిశ్రామికవృద్ధి నమోదైంది. 2010 జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ 9.9 శాతం వృద్ధి చూపింది. 
సెప్టెంబరు 14 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తగ్గించింది. గతంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేయగా దీన్ని తాజాగా 7.9 శాతానికి పరిమితం చేసింది.
¤ 2012 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగలదని పేర్కొంది. గతంలో ఇది 7.8 శాతానికి తగ్గగలదని అంచనా వేసింది.
¤ ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో ఆసియాలోని వర్థమాన దేశాలు ఊహించినదానికన్నా తక్కువ వృద్ధిరేటును నమోదు చేయనున్నామని ఏడీబీ వెల్లడించింది. ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలు సగటున ఈ ఏడాది (2011) 7.8 శాతం వృద్ధి చెందగలవని ఏప్రిల్‌లో అంచనా వేయగా దీన్ని 7.5 శాతానికి తగ్గించింది. 2012 ఏడాది వృద్ధిరేటును 7.7 శాతం నుంచి 7.5 శాతానికి సవరించింది. 
సెప్టెంబరు 16 
¤ ఆస్ట్రేలియాలో 3 బొగ్గు గనులతో పాటు ఒక రైల్వే లైనునౌకాశ్రయం ప్రాజెక్టులభాగస్వామ్యానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవీకే గ్రూపు ప్రకటించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ నెలల మధ్యరాష్ట్రస్థూల ఉత్పత్తి 8.49 శాతం వృద్ధి రేటు నమోదయిందిఇదే వ్యవధిలో జాతీయస్థాయిలో 7.74 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది.
¤ రాష్ట్రంలో వ్యవసాయంపరిశ్రమల రంగాలు జాతీయ స్థాయి కంటే అధిక ప్రగతినికనబరిచాయిసేవారంగం మాత్రం వెనుకబడిందివ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు10.83 శాతం కాగా జాతీయ స్థాయి వృద్ధిరేటు 3.93గా నమోదయిందిరాష్ట్రంలోపరిశ్రమల రంగం వృద్ధిరేటు 7.52 శాతం కాగాజాతీయ స్థాయిలో 5.10 శాతంవృద్ధిరేటు నమోదు అయిందిఇక సేవల రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు 8.57 శాతం,జాతీయ స్థాయి వృద్ధిరేటు 10 శాతం.
¤  ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో వ్యవసాయపారిశ్రామికసేవల రంగాల్లోకలిపి రూ.74,509 కోట్ల విలువైన ఉత్పత్తులు ఉన్నట్లు అర్థ గణాంక శాఖ అంచనావేసిందిగత ఏడాది ఇదే వ్యవధిలో వీటి విలువ రూ.68,681 కోట్లు.
¤ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మధ్యంతర పరపతి విధాన సమీక్షనుముంబయిలో ప్రకటించారు.
¤ పారిశ్రామిక వర్గాలుబ్యాంకర్లు ఊహించిన విధంగానే నగదు లభ్యతను మరింతతగ్గించడానికి ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేటైన రెపో రేటును పావు శాతం పెంచి8.25 శాతానికి సవరించిందిదీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 0.25 శాతం పెరిగి7.25 శాతం అవుతుంది.
¤ ఈసారి కూడా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), చట్టపరమైన లిక్విడిటీ నిష్పత్తి(ఎస్ఎల్ఆర్వంటి ఇతర సాధనాల జోలికి కేంద్ర బ్యాంకు పోకపోవడం గమనార్హం.దాదాపు గత ఏడాదిన్నర కాలంలో కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచడం ఇదిపన్నెండోసారి.
¤ అయితే వడ్డీ రేట్లు ఇంతగా పెంచుతున్నా ద్రవ్యోల్బణం మాత్రం ఎక్కడా తగ్గుముఖంపడుతున్న దాఖలాలు లేక పోవడం ఆందోళనకరమైన అంశంగత 13 నెలల కాలంలోనెలవారీగా ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తేఇది 8.20 నుంచి 9.78 శాతం మధ్యనమోదవుతూ వచ్చిందిఅంటే పెద్ద మార్పు లేకుండా స్థిరంగా 8 - 9.8 శాతం ఉంటూవస్తున్నట్లు స్పష్టమౌతోందిఅదే సమయంలో రెపోరివర్స్‌రెపో రేట్లు దాదాపు 4శాతం నుంచి 8.25 శాతం వరకూ పెరిగాయిఅయినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గలేదంటేకేవలం నగదు సరఫరా మాత్రమే కాదు... ఇంకా బలమైన కారణాలేవో పనిచేస్తున్నాయనే భావించాల్సి వస్తోందిఇటువంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకిరావాలంటే సరకుల సరఫరా గణనీయంగా పెరగాలనిమరోదారి లేదని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
¤ ఏదేమైనప్పటికీ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్యప్రజానీకం పై పెనుభారం పడుతోంది రుణాలు తీసుకుని ఇళ్లువాహనాలు కొనుగోలుచేసిన వారుబ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు అదనపు వడ్డీ భారాన్నిమోయలేక సతమతం అవుతున్నారుమరోపక్క మండిపోతున్న నిత్యావసరాలు,కూరగాయల ధరలు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న దాఖలాలే లేవని స్పష్టంచేస్తున్నాయిఇదే సమయంలో చమురు ధరలను పెంచుతూ ప్రభుత్వం ప్రజలపైమరింత భారాన్ని మోపుతోంది.
రెపోరివర్స్ రెపో రేట్లు గత 12 దఫాలుగా పెరిగిన తీరు బేసిక్ పాయింట్లలో
      తేదీ                                          రెపోరేటు                   రివర్స్‌రెపో రేటు
19 మార్చి 2010                           25(5.00)                 25(3.50)
20 ఏప్రిల్ 2010                            25(5.25)                 25(3.75)
02 ఆగస్టు 2010                           25(5.50)                25(4.00)
27 ఆగస్టు 2010                           25(5.75)                 50(4.50)
02 సెప్టెంబరు 2010                      25(6.00)                50(5.00)
02 నవంబరు 2010                      25(6.25)                 25(5.25)
25 జనవరి 2011                          25(6.50)                 25(5.50)
17 మార్చి 2011                           25(6.75)                  25(5.75)
03 మే 2011                                50(7.25)                 50(6.25)
16 జూన్ 2011                               25(7.50)                 25(6.50)
26 జులై 2011                               50(8.00)                 50(7.00)
16 సెప్టెంబరు 2011                        25(8.25)                 25(7.25)
¤ రెపోరేటుస్వల్ప కాలిక సర్దుబాటు నిమిత్తం ఆర్‌బీఐ నుంచి తీసుకున్న సొమ్ముపైబ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీరేటు.
¤ రివర్స్ రెపో రేటు బ్యాంకులు తమ వద్దనున్న మిగులు సొమ్మును ఆర్‌బీఐ వద్దపెట్టినపుడు లభించే వడ్డీరేటు.
¤ తదుపరి సమీక్ష అక్టోబరు 25 జరుగుతుంది
సెప్టెంబరు 19 
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన 12 ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖఆమోదించిందివిటి విలువ రూ.242.88 కోట్లు.

No comments:

Post a Comment