¤ అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి అండతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగం 5.4 శాతం వృద్ధిరేటును నమోదు చేయనుంది. గత ఏడాది ఇది కేవలం 0.4 శాతం మాత్రమే. ధాన్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, చెరకు, ఉద్యానవన పంటల ఉత్పత్తి ఆకర్షణీయంగా ఉన్నందున వ్యవసాయం, అడవులు, మత్స్యరంగం మంచి వృద్ధిరేటు నమోదు చేయనుందని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) ముందస్తు అంచనాల్లో పేర్కొంది.
¤ వ్యవసాయ రంగం ఆశావహంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీతో) 8.6 శాతం వృద్ధిరేటును నమోదు చేయనుందని సీఎస్ఓ తెలిపింది. గత ఏడాది ఇది 8 శాతం.¤ రానున్న బడ్జెట్‌లో వివిధ రంగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఆర్థిక సంవత్సరానికి చివర్లో ప్రభుత్వం ముందస్తు అంచనాలు వేస్తుంది.¤ 2010-11 ఏడాదికి వ్యవసాయం¤ ఉత్పత్తుల వృద్ధిరేటు అంచనాలు(శాతం)¤ ఆహారధాన్యాలు 6.5¤ నూనెగింజలు 11.9¤ చెరకు 15.2¤ పత్తి 41.2¤ పళ్లు 4.1¤ కూరగాయలు 3.8¤ 2010- 11 ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 17.3 శాతం పెరిగి రూ. 46,492 నుంచి రూ. 54,527 చేరవచ్చని సీఎస్ఓ తాజాగా అంచనా వేసింది. అయితే 2004-05 ఏడాది ధరల్లో లెక్కిస్తే ఇది రూ. 36,003 ఉంటుంది. ప్రస్తుత ధరల్లో 2010-11 ఏడాదికి ఆర్థిక వ్యవస్థ విలువ గత ఏడాదితో పోలిస్తే రూ. 61,33,230 కోట్ల నుంచి రూ. 72,56,571 కోట్లకు చేరుతుంది.¤ కేంద్ర ప్రభుత్వం నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-జనవరి నెలలకు 20.37 శాతం పెరిగాయి. ఏడాది క్రితం ఇదేకాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2,63,765 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ. 3,17,501 కోట్లకు చేరాయి. ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్ పన్ను వసూళ్లు 24.78 శాతం వృద్ధితో రూ. 1,73,799 కోట్ల నుంచి రూ. 2,16,872 కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 89,561 కోట్ల నుంచి రూ. 1,00,191 కోట్లకు పెరిగింది. ఇది 11.87 శాతం వృద్ధికి సమానం.
¤ దేశంలో గోధుమల ఉత్పత్తి ఈ ఏడాది నూతన గరిష్ఠ స్థాయికి చేరొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇదివరకెన్నడూ లేనంతగా 8.147 కోట్ల టన్నుల గోధుమలు ఉత్పత్తి అవుతాయని భావిస్తోంది. ఇదే సమయానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 23.20 కోట్ల టన్నులకి చేరొచ్చని అంచనా వేసింది.¤ 2010-11 పంట సంవత్సరానికి సంబంధించి రెండో ముందస్తు అంచనాలను వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్ న్యూఢిల్లీలో ప్రకటించారు.¤ రెండో ముందస్తు అంచనా వివరాలుపంట గతేడాది ఉత్పత్తి ఈ ఏడాది అంచనా(కోట్ల టన్నుల్లో)ఆహార ధాన్యాలు 21.81 23.20బియ్యం 8.99 9.40గోధుమలు 8 8.14పప్పుధాన్యాలు 1.46 1.65నూనెగింజలు 2.48 2.78చెరకు 29.23 33.66పత్తి (కోట్ల బేళ్లలో) 2.42 3.39
¤ సుమారు 2 వేల జనాభాను కలిగి బ్యాంకులు లేని 73 వేల గ్రామాలకు మార్చి 2012 నాటికి కనీస బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం, భారతీయ బ్యాంకుల కూటమి (ఐబీఏ- ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) సంయుక్తంగా రూపొందించిన స్వాభిమాన్ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం గ్రామీణ, పట్టణ భారత దేశానికి మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాన్ని తగ్గించడమే.¤ ముఖ్యంశాలు: 5 కోట్ల కొత్త గ్రామీణ బ్యాంక్ ఖాతాలను తెరవడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శాఖలు లేని బ్యాంకింగ్‌ని అందించడం, గ్రామీణ, పట్టణ మార్కెట్ల మధ్య సంబంధాలను పెంచడం, బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా ఇంటిముంగిటకు బ్యాంకింగ్ సౌకర్యం, బ్యాంక్ ఖాతా తెరవడం కోసం సులువైన పద్ధతులు, లబ్ధిదారుల ఖాతాలకు త్వరితగతిన నగదు బదిలీ/ పంపిణీ, ప్రభుత్వ సబ్సిడీలు మరియు సాంఘిక భద్రతా చెల్లింపులు.
¤ దేశ ఎగుమతులు జనవరి నెలలో 20.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గత సంవత్సరం జనవరితో పోల్చి చూస్తే 32.5 శాతం వృద్ధి నమోదు అయ్యింది.¤ 2010-11 ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో దేశం వెలుపలికి వెళ్లిన సరుకుల (ఔట్‌బౌండ్ షిప్‌మెంట్స్)లో వృద్ధి క్రితం ఏడాది కన్నా 29.4 శాతం ఎగబాకి, 184.6 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది.¤ ప్రాథమిక అంచనాలను బట్టి చూస్తే జనవరిలో దిగుమతులు అంతకు ఒక ఏడాది క్రితం కన్నా 13.1 శాతం అధికంగా 28.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య దిగుమతులు 17.6 శాతం వృద్ధితో 273.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా ఈ పదినెలల కాలంలో వాణిజ్య లోటు 89 బిలియన్ డాలర్లు అయ్యింది.
¤ అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగిపోయిన దృష్ట్యా రైతులకిచ్చే సబ్సిడీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2011-12 ఆర్థిక సంవత్సరానికి ఎరువుల సబ్సిడీ అదనంగా రూ.9 వేల కోట్ల వరకూ పెరగనుంది.¤ 2009-10లో ఎరువుల సబ్సిడీ రూ.64,000 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటిప వరకూ సబ్సిడీ మొత్తం రూ.53,000 కోట్లుగా ఉంది.
¤ పెచ్చుమీరుతున్న ఆహార ధరలు గతేడాది జూన్ చివరి నుంచి ఇప్పటి దాకా వర్ధమాన దేశాల్లోని 4.4 కోట్ల మందిని మరింత పేదరికంలోకి నెట్టేశాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్ పేర్కొన్నారు.¤ రోజుకు 1.25 డాలర్లు (దాదాపు రూ. 56.25) కంటే తక్కువ సంపాదించే వారు తీవ్ర దారిద్య్రంలో ఉన్నట్లు లెక్కగడతారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరల సూచీ అక్టోబరు 2010 నుంచి 2011 జనవరి మధ్య 15 శాతానికి ఎగబాకింది.
¤ కొత్త సిరీస్‌తో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అమలులోకి వచ్చింది. 2011, జనవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) 6 శాతం పెరిగి 106 పాయింట్లకు చేరింది. గత ఏడాది (2010) సగటు 100 పాయింట్లతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదు అయింది. నెలవారీ అసలు పెరుగుదలను పోల్చి లెక్క కట్టడానికి ఇంకా ఏడాది పాటు ఆగాల్సి ఉంటుంది.¤ వినియోగదారుల స్థాయిలో ధరల కదలికలను మరింతగా ప్రతిబింబించే విధంగా కొత్త సిరీస్‌ను రూపొందించారు. కొత్త సిరీస్‌వల్ల వినియోగ ధరల్లో మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు, ప్రభుత్వానికి వీలుంటుంది.¤ జనవరి నెలకు గ్రామీణ సీపీఐ 107 పాయింట్ల, పట్టణ సీపీఐ 104 పాయింట్లుగా నమోదు అయింది.¤ కేరళ, ఒరిస్సా, మేఘాలయ రాష్ట్రాల్లో అధికంగా సీపీఐ 108 పాయింట్లు ఉంది.
¤ 2010-11 ఆర్థిక సమీక్ష నివేదికను న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎమ్ఈఏసీ) ఛైర్మన్ సి.రంగరాజన్ విడుదల చేశారు.¤ పరిశ్రమలకు ప్రకటించిన కొన్ని పన్ను ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్లో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ నివేదికలో మండలి సూచించింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.¤ జీడీపీపై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి 8.6 శాతంగా ఉండొచ్చు. (ఇది ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఉంది) 2011-12లో జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవచ్చు.¤ 2010-11లో వ్యవసాయం 5.4 శాతం వృద్ధిని సాధించవచ్చు. ఇది 2009-10 లో నమోదైన 0.4 శాతం కంటే చాలా ఎక్కువ. ఈసారి గోధుమలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావచ్చు.¤ సేవలు, పరిశ్రమల రంగాలు కొన్నేళ్లుగా మంచి వృద్ధిని కనబరుస్తున్నాయి. ఈసారి సేవల రంగం 9.6 శాతం, పరిశ్రమల రంగం 8.1శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం 9.1 శాతం, తయారీరంగం 8.8 శాతం మేర వృద్ధిని ప్రదర్శించాయి.¤ ద్రవ్యోల్బణంపై: ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు అసౌకర్యం కలిగించే స్థాయిలో ఉంది. రిజర్వు బ్యాంకుతోపాటు కేంద్రం కూడా కఠినమైన ద్రవ్య- పరపతి విధానాన్ని అమలుచేస్తూ, దీన్ని అదుపులోకి తీసుకురావాలి.¤ ద్రవ్యలోటుపై: ఇది వరకు ద్రవ్యలోటు జీడీపీలో 5.5 శాతంగా ఉండవచ్చుని అంచనా వేయగా, తాజాగా ద్రవ్యలోటు 5.2 శాతంగా ఉండవచ్చని అంచనా సవరించారు.¤ ప్రపంచంలో పన్నుల బెడద లేని ప్రాంతాలకు భారత్ నుంచి ధనం తరలిపోవడాన్ని అడ్డుకొనే దిశగా ప్రభుత్వం తన కృషిని తీవ్రతరం చేయాలి. పన్నుల వసూలు యంత్రాంగాన్ని సైతం పటిష్టపరచాలి.¤ వస్తువులు, సేవలకు ఒకే ఉమ్మడి పన్ను ఉండాలి. సిగరెట్లపై విడిగా పన్ను వేయాలి.¤ భారత ఇంధన రంగంలో కీలక ఒప్పందం కుదిరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన 23 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో 30 శాతం వాటాను బ్రిటన్‌కు చెందిన బ్రిటీష్ పెట్రోలియం (బీపీ) సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 720 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 32,000 కోట్ల) భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదే అవుతుంది.¤ ఒప్పంద పత్రాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ డూడ్లేలు లండన్‌లో సంతకాలు చేశారు.¤ గతంలో ర్యాన్‌బ్యాక్సీ లేబొరేటరీస్‌లో మెజారిటీ వాటాను జపాన్ ఫార్మా కంపెనీ దైచీ శాంక్యో 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది రెండో అతిపెద్ద ఎఫ్‌డీఐ.
¤ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 2011-12 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010-11 బడ్జెట్‌లో సవరణ కేటాయింపులతో పోలిస్తే కొత్త బడ్జెట్ ఏకంగా రూ. 17,486 కోట్ల అదనపు కేటాయింపులతో రూ. 1,28,542.02 కోట్లు.ముఖ్యాంశాలు:¤ రెవెన్యూ వసూళ్లు - రూ. 1,00,995.26 కోట్లు¤ మూలధన వసూళ్లు - రూ. 27,774.78 కోట్లు¤ ప్రణాళికేతర వ్యయం - రూ. 80,984.16 కోట్లు¤ ప్రణాళికా వ్యయం - రూ. 47,557.85 కోట్లు¤ రెవెన్యూ వ్యయం - రూ. 97,169.62 కోట్లు¤ మూలధన వ్యయం - రూ. 17,854.54 కోట్లు¤ రెవెన్యూ మిగులు - రూ. 3,825.64 కోట్లు¤ అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా వివిధ పనులు, పథకాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చేందుకు రూ. 400 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.¤ ఆరువేల కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీకి రూ. 200 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించారు.¤ సాగునీటి రంగానికి రూ. 15,010 కోట్లు, తాగునీటి రంగానికి రూ. 608 కోట్లు, పురపాలనకు రూ. 5,083 కోట్లు, వైద్యం-ఆరోగ్యానికి రూ. 5,040 కోట్లు, రాజీవ్ యువశక్తి పథకానికి రూ. 32.69 కోట్లు, సమాచార సాంకేతిక శాఖకు రూ. 51.22 కోట్లు, రాజీవ్ ఉద్యోగశ్రీకి రూ. 40 కోట్లు కేటాయించారు.¤ గృహనిర్మాణానికి రూ. 2,300 కోట్లు, బోధన రుసుములు, ఉపకార వేతనాలకు రూ. 2,745 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ. 858 కోట్లు, చేనేతకు రూ. 322 కోట్లు, పావలా వడ్డీకి రూ. 400 కోట్లు కేటాయించారు.¤ విద్యారంగానికి రూ. 17,362 కోట్లు, వ్యవసాయానికి రూ. 3,534 కోట్లు, పౌరసరఫరాలకు రూ. 2,500 కోట్లు, పోలీస్ శాఖకు రూ. 3,820 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 4,979 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ. 4,108 కోట్లు కేటాయించారు.రూపారాక (అంకెలు శాతాల్లో) పోక1. కేంద్ర పన్నుల్లో వాటా 16.66 1. అభివృద్ధి వ్యయం 65.142. రాష్ట్ర పన్నులు, సుంకాలు 55.88 2. రుణాలపై వడ్డీ తదితరాలు 11.943. వడ్డీ వసూళ్లు 7.09 3. పరిపాలనా వ్యయం 6.554. ఇతర పన్నేతర ఆదాయం 20.37 4. పన్ను వసూళ్ల ఖర్చు 1.205. ఇతర వ్యయం 11.386. మిగులు 3.79¤ రాష్ట్ర ప్రజానీకంలో ఒక్కొక్కరిపై రూ. 14,548.65 అప్పుల భారం పడింది. ప్రభుత్వం ఎడాపెడా రుణాలు చేస్తుండడంతో ఏటేటా ఇది పెరుగుతూనే వస్తోంది.¤ 2010-11లో మొత్తం అప్పులు రూ. 1,23,227 కోట్లు ఉన్నట్లు ఆర్థిక గణన తేల్చి చెప్పింది. 2011 మార్చి నాటికి రాష్ట్ర జనాభా 8.47 కోట్లకు చేరుకుంటుందని, దీని ప్రకారం రాష్ట్రంలో తలా ఒక్కొక్కరిపై రూ. 14,548.65 రుణ భారం పడుతుందని వివరించింది. ఈ అప్పులపై 2011-12లో వడ్డీలకే రూ. 11,437 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2009-10తో పోలిస్తే 2010-11లో రూ. 13,884 కోట్ల మేర రుణాలు పెరిగాయని వివరించింది. 2004-05లో రూ. 66,393 కోట్లుగా ఉన్న అప్పులకు 2010-11 నాటికి రూ. 56,834 కోట్లు అదనంగా వచ్చి చేరటం గమనార్హం.¤ గత ఐదేళ్లలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు, ప్రజా టెలిఫోన్ బూత్‌ల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా సెల్‌ఫోన్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా మిన్నంటింది. 2005లో 51.12 లక్షలు ఉన్న వాహనాల సంఖ్య 2010 నాటికి 95.89 లక్షలకు చేరింది. 2007లో 29.70 లక్షలు ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య 2010 నాటికి 23.92 లక్షలకు చేరింది. 2009లో 4.14 కోట్లు ఉన్న సెల్‌ఫోన్ల సంఖ్య 2010 నాటికి 5.27 కోట్లకు చేరింది. 2007 నాటికి 7.2 లక్షలు ఉన్న ప్రజా టెలిఫోన్ల సంఖ్య 2010 నాటికి 4.2 లక్షలకి చేరింది.¤ కొత్త వార్షిక ప్రణాళిక ద్వారా చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3,547 కోట్ల మేర విదేశీ రుణాలు అందనున్నాయి. ప్రపంచబ్యాంకు, డీఎఫ్ఐడీ తదితరాల నుంచి ఈ మొత్తం అందుతుంది. నడుస్తున్న వార్షిక ప్రణాళికలో ఈ రుణాలు రూ. 2,260 కోట్లు మాత్రమే ఉన్నాయి. పన్నుల వసూళ్లకు అయ్యే ఖర్చు ఇప్పటికంటే కొత్త బడ్జెట్‌లో బాగా పెరగబోతోంది. నడుస్తున్న బడ్జెట్‌లో వసూళ్ల కోసం మొత్తం వసూళ్లలో 1.18 శాతం (రూ.1,028 కోట్లు) ఖర్చు పెడుతుండగా కొత్త బడ్జెట్‌లో ఇది 1.25 శాతం (రూ. 1,211 కోట్లకు) చేరనుంది.¤ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన సంస్థలు వెనక్కి మళ్లుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లలోనూ ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.¤ 2010 సెప్టెంబరు నాటికి 6910 సంస్థలు రూ. 5,46,904 కోట్ల పెట్టుబడులతో 11,72,196 మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకొచ్చాయి. పరిశ్రమల శాఖకు ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో 4096 సంస్థలు మాత్రమే కార్యాచరణకు పూనుకున్నాయి. 1814 సంస్థలు తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నాయి. తద్వారా రూ. 1,12,218 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయి.¤ సెజ్‌ల ద్వారా ప్రకటించిన రూ. 1,05,447 కోట్ల పెట్టుబడులకు గాను రూ. 12,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకూ వచ్చాయి.¤ ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటుకు మించి వృద్ధిరేటును సాధించబోతోంది. 2010-11 ఆర్థిక సంవత్సరానికి భారత్ 8.58 శాతం వృద్ధిరేటును సాధించనుందని కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగ్గా 8.89 శాతం వృద్ధిరేటును సాధించనుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో శాసనసభకు తెలిపారు. రాష్ట్రంలో 2007-08లో అత్యధికంగా 12.2 శాతం వృద్ధిరేటు సాధించింది. తర్వాత రెండేళ్లు తగ్గుముఖం పడుతూ వచ్చింది. మళ్లీ ఈ ఏడాది అలజడులు, తుపానుల మధ్య కూడా మెరుగైన వృద్ధిరేటును సాధిస్తోంది. ఇందులో పేర్కొన్న గణాంకాలన్నింటికీ 2004-05 స్థిర ధరల సూచీ ఆధారం.¤ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా గణనీయంగా 7.97 శాతం పెరిగింది. గత ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2007-08లో మాత్రమే అత్యధికంగా 10.38 శాతం పెరుగుదల నమోదు అయింది.¤ రాష్ట్రమంతా తలసరి ఆదాయం పెరిగి ఎంతో కొంత కళకళలాడుతుంటే కరీంనగర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం తలసరి ఆదాయం గత ఏడాది కన్నా తగ్గిపోయింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం 2008-09తో పోలిస్తే 2009-10లో సగటున రూ.1629 చొప్పున పెరిగింది. కరీంనగర్ జిల్లాలో రూ.344 మేర, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.158 మేర, తూర్పుగోదావరి జిల్లాలో రూ.89 మేర తగ్గుదల నమోదైంది.¤ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.36,345తో పోలిస్తే 13 జిల్లాలు వెనకబడ్డాయి. 2008-09 తలసరి ఆదాయంతో పోలిస్తే 2009-10లో రూ.5066 పెరుగుదలతో హైదరాబాద్ మొదటిస్థానం ఆక్రమించింది. తర్వాత రంగారెడ్డి రూ.2905, కృష్ణాజిల్లా రూ.2592, విశాఖపట్నం రూ.2497 చొప్పున పెరుగుదల నమోదు చేశాయి. 2009-10లో శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)సంవత్సరం జీఎస్‌డీపీ వృద్ధిరేటు(రూ.కోట్లలో) (శాతాల్లో)2005-06 2,46,210 9.572006-07 2,73,730 11.182007-08 3,06,645 12.022008-09 3,22,053 5.022009-10 3,40,712 5.792010-11 3,71,007 8.89
రాష్ట్ర తలసరి ఆదాయంసంవత్సరం తలసరి ఆదాయం (రూ.) వృద్ధిరేటు (శాతాల్లో)2005-06 27,486 8.552006-07 30,114 9.562007-08 33,239 10.382008-09 34,716 4.442009-10 36,345 4.692010-11 39,240 7.97 జిల్లాల వారీ తలసరి ఆదాయం (రూ.లలో)జిల్లా 2008-09 2009-10పశ్చిమగోదావరి 33,422 33264కృష్ణా 40,495 43,087గుంటూరు 33,524 34,769ప్రకాశం 33,380 35,648నెల్లూరు 36,768 37,744
¤ దేశ ఆర్థిక ముఖచిత్ర దర్శనం గావించే ఆర్థిక సర్వే (2010-11)ను ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ ప్రధాన సలహాదారు కౌశిక్‌బసు నేతృత్వంలో ఈ సర్వే తయారైంది.¤ ఇందులో ముఖ్యాంశాలు.¤ పశ్చిమాసియాలో సంక్షోభం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆహార ధరల వల్ల మన దేశంలో కూడా ధరల పెరుగుదల కొనసాగొచ్చు. కొనుగోలు శక్తి పెరగడమూ ధరల పెరుగుదలకు కారణమయింది. ద్రవ్యోల్బణం గత అంచనా కంటే 1.5 శాతం ఎక్కువగా ఉండొచ్చు.¤ సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని, పెట్టుబడుల్ని గణనీయంగా పెంచడం ద్వారా రెండో హరిత విప్లవానికి ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రతను కల్పించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి 5.4 శాతం ఉండొచ్చని అంచనా. గత ఏడాది ఇది కేవలం 0.4 శాతమే. వచ్చే ఏడాది ఇది 8.5 శాతానికి పెరిగితేనే 11వ ప్రణాళిక లక్ష్యాన్ని అందుకోగలం.¤ 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి రూ. 41 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడాలంటే ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులను ఆకర్షించాలి.¤ దేశంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నప్పటికీ, పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకున్నప్పటికీ 2011-12లో భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 8.6 శాతం ఉంటుంది.¤ విద్యుత్తు రంగంలో భారీ సంస్కరణలు అవసరం. సరఫరా, పంపిణీ నష్టాలు 35 శాతం మేర ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం.¤ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం శాశ్వత ఆస్తుల రూపకల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు మళ్లాలి.¤ గడిచిన ఐదేళ్లలో సామాజిక రంగాలు ఖర్చు చేసిన వ్యయం దేశ జీడీపీలో 5 శాతానికి పెరిగింది.¤ విదేశీ మారకద్రవ్య నిల్వలు గత డిసెంబరు చివరి నాటికి 297.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.¤ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా సమర్థమైన పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి.¤మమతా బెనర్జీ లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యాంశాలు¤ రైల్వేల చరిత్రలో తొలిసారిగా లక్షకోట్ల రూపాయలు దాటిన (1,06,239 కోట్ల రూపాయలు) రాబడి అంచనాలతో, 57 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.¤ సరకు రవాణా ద్వారా రూ. 68,620 కోట్లు, ప్రయాణికుల ఛార్జీల ద్వారా రూ. 30,456 కోట్లు, ఇతరత్రా ఆదాయం రూ. 7,163 కోట్ల ఆదాయాన్ని ఆశించారు.¤ కొత్తగా 56 ఎక్స్‌ప్రెస్, 3 శతాబ్ది, 9 దురంతో రైళ్లు, రాష్ట్రాలరాజధానులతో పట్టణాలను కలుపుతూ 10 ప్రత్యేక రైళ్లు, జన్మభూమి గౌరవ్ పేరుతో నాలుగు పర్యాటక రైళ్లు, ఠాగూర్ 150వ జయంతికి 4 కవిగురు ఎక్స్‌ప్రెస్‌లు, 2013లో స్వామి వివేకానంద 150వ జయంతికి వివేక్ ఎక్స్‌ప్రెస్ పేరిట 4 కొత్త రైళ్లు, జైపూర్-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయి మార్గాల్లో ఏసీ డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభం.¤ మీడియా ప్రతినిధులకు కుటుంబంతో కలసి 50 శాతం రాయితీపై ఏడాదికి రెండుసార్లు ప్రయాణించే అవకాశం.¤ గో ఇండియా పేరుతో బహుళ ప్రయోజన స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టనున్నారు.¤ రైళ్ల వేగాన్ని గంటకు 160-200 కిలో మీటర్లకు పెంచే అంశంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.¤ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ప్రధానమంత్రి రైల్‌వికాస్ యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక రైలు మార్గాన్ని కేటాయించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి దుగరాజ పట్నానికి సుమారు 40 కి.మీ. మేర ఈ కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.¤ దక్షిణ మధ్య రైల్వేలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.3,666 కోట్లు కేటాయించారు.¤ కొత్తగా ప్రకటించిన 236 ఆదర్శ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి హరిశ్చంద్రాపూర్, గుంటూరు, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొత్తగూడెం, ఘన్‌పూర్, మల్కాజ్‌గిరి, రఘునాథపల్లి ఉన్నాయి. ఆదర్శ స్టేషన్ల లక్ష్యం- సురక్షిత తాగునీరు, బోగీతో సమానమైన ఎత్తులో ఉండే ప్లాట్‌ఫాం, వికలాంగులు తేలిగ్గా స్టేషన్లోకి వచ్చే సౌకర్యాలు.¤ పశ్చిమ బెంగాల్ సింగూరులో కోచ్ ఫ్యాక్టరీ.¤ నందిగ్రామ్‌లో పారిశ్రామిక పార్కు.¤ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సారథ్యంలో డార్జిలింగ్‌లో అత్యున్నత ప్రమాణాలతో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు.¤ 2011-12ని జీవ ఇంధన ఏడాదిగా ప్రకటించారు.¤ వృద్ధులకు రాయితీ 40 శాతం. 58 ఏళ్ల నుంచే మహిళలకు రాయితీ కల్పించారు.
¤ కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ 2011-12 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు.
¤ బడ్జెట్ ముఖ్యాంశాలు¤ వ్యక్తిగత ఆదాయ పన్ను విభాగంలో సీనియర్ సిటిజన్స్ వయో పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు.¤ 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.2.5 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు¤ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 1.8 లక్షలకు పెంపు¤ 80 ఏళ్లు దాటితో రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు¤ 130 వస్తువులపై 1శాతం ఎక్సైజ్ పన్ను¤ సాగు రుణాలు రూ. 3.75 లక్షల కోట్ల నుంచి రూ. 4.75 లక్షల కోట్లకు పెంపు¤ ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ. 40 వేల కోట్ల ఉపసంహరణ.¤ 80 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛను రూ. 500కు పెంపు.¤ గ్రామీణ న్యాయాస్థానాలకు రూ. 1432 కోట్లు కేటాయించారు.¤ అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకుల వేతనాలు రెట్టింపు అయ్యాయి. కార్యకర్తల వేతనాలు రూ. 1500 నుంచి రూ. 3 వేలకు, సహాయకులకు రూ. 750 నుంచి రూ. 1500 కు పెంపు. రూ. 500 కోట్ల కార్పస్‌తో ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి నిధి ఏర్పాటు.¤ కేటాయింపులు¤ మహిళా, శిశు సంక్షేమానికి రూ. 12,733 కోట్లు.¤ జాతీయ పౌష్టికాహార కార్యక్రమానికి రూ. 90 కోట్లు.¤ భారత జాతీయ హరిత దళాని (నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్)కు రూ. 200 కోట్లు.¤ దేశంలోని ముఖ్యమైన నదులు (గంగానది మినహా), సరస్సుల శుద్ధికి రూ. 200 కోట్లు.¤ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు రూ. 55.68 కోట్లు. ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ)కు రూ. 279 కోట్లు.¤ ఆరు ప్రాధాన్య పథకాలతో కూడిన ీభారత నిర్మాణ్ కార్యక్రమానికి రూ. 58 వేల కోట్లు.¤ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ. 6 వేల కోట్లు.¤ విద్యుత్ రంగ అభివృద్ధి, సంస్కరణలకు రూ. 2,034 కోట్లు.¤ జాతీయ జల విద్యుత్ సంస్థకు రూ. 813 కోట్లు.¤ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి రూ. 3540 కోట్లు. మారుమూల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యానికి రూ. 500 కోట్లు.¤ ఆధార్ ప్రాజెక్టుకు రూ. 1470 కోట్లు.¤ రహదారులకు రూ. 13,283 కోట్లు.¤ విద్యా రంగానికి రూ. 52,057 కోట్లు. సర్వశిక్ష అభియాన్‌కే రూ. 21 వేల కోట్లు.¤ పారిశుద్ధ్య రంగానికి రూ. 1650 కోట్లు.¤ రక్షణ రంగానికి రూ. 1,64,415 కోట్లు.¤ విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ పేరిట కోటి రూపాయలతో అంతర్జాతీయ పురస్కారం ఏర్పాటు కానుంది. ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డును తాజా బడ్జెట్‌లో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.¤ వ్యవసాయానికి రూ. 13,662 కోట్లు.¤ అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన స్వావలంబన్ పింఛన్ పథకం నుంచి 50 ఏళ్ల వయసులోనే విరమించుకోవచ్చని ప్రణబ్ పేర్కొన్నారు. ఇంతకు ముందు 60 ఏళ్ల వయసు వస్తేనే విరమణకు అనుమతించేవారు.¤ బడుగు, బలహీన వర్గాలకు రూ. 5,375 కోట్లు కేటాయించారు.¤ నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు రూ. 1800 కోట్లు కేటాయించారు. దేశంలోని మావోయిస్టు ప్రభావిత 60 జిల్లాలకు రూ. 30 కోట్ల చొప్పున కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లోని జిల్లాలు లబ్ధి పొందనున్నాయి.¤ పట్టణాభివృద్ధికి రూ. 6,855.23 కోట్లు.¤ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖకు రూ. 5,679 కోట్లు.¤ మైనారిటీల అభివృద్ధికి రూ. 2,850 కోట్లు.¤ సింగరేణి కాలరీస్‌కు రూ. 2804.30 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ. 2895 కోట్లు.¤ వైద్యం, ప్రజారోగ్యానికి రూ. 26,760 కోట్లు.¤ కొత్తగా విధించిన సేవా పన్నుల ద్వారా రూ. 4,000 కోట్ల రాబడిని పొందాలని నిర్ణయించారు.¤ సబ్సిడీలకు రూ. 1,43,570 కోట్లు.¤ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,000 కోట్లు.¤ కేంద్రానికి వచ్చే పన్నుల నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి రూ. 18,304 కోట్ల వాటా లభించనుంది. రాష్ట్ర బడ్జెట్‌లోని అంచనాల కంటే రూ. 1,478 కోట్లు ఎక్కువగా రానున్నాయి.¤ విజయ్ కేల్కర్ నేతృత్వంలోని 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సేవా పన్ను మినహా మిగతా పన్నుల మొత్తంలో రాష్ట్రానికి 6.937 శాతం వాటా అందుతుంది.¤ సూక్ష్మ రుణ రంగానికి రూ. 100 కోట్ల ఈక్విటీ నిధిని ఏర్పాటు చేయనున్నారు.¤ మానవ వనరుల అభివృద్ధి కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ. 500 కోట్లు కేటాయించారు.¤ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు రూ. 2,300 కోట్లు కేటాయించారు.¤ కాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రత్యేక సాయం కింద రూ. 8 వేల కోట్లు ప్రకటించారు.¤ ప్రణబ్ ముఖర్జీకి ఇది 6వ బడ్జెట్. గతంలో మన్మోహన్ సింగ్, దేశ నాలుగో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.¤ 1982-83, 1983-84, 1984-85, 2009-10, 2010-11, 2011-12 లలో ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Monday, July 21, 2014
ఫిబ్రవరి 2011 - ఆర్థికరంగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment