¤ పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొద్ది కొద్దిగా కోలుకుంటుండటంతో నవంబరు నెలకు ఎగుమతులు 26.5 శాతం పెరిగి 1880 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.84,600 కోట్లు) చేరాయి. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 20,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని అధిగమించే వీలుంది. నవంబరు నెలకు దిగుమతుల్లోనూ 11.2 శాతం పెరుగుదల నమోదైంది. 2,770 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. దీంతో నవంబరు నెలకు వాణిజ్యలోటు 890 కోట్ల డాలర్లుగా నమోదైంది.
¤ దేశంలో వినియోగ వస్తువుల ధరల పరిస్థితి మరింత స్పష్టంగా, పారదర్శకంగా ఉండే దిశగా మరో అడుగు పడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించి నెలవారీ ఇక రెండు వేర్వేరు వినియోగ ధరల సూచీలు కొత్తగా విడుదల కానున్నాయి. ¤ ఇప్పటికే దేశంలో 5 రకాల ద్రవ్యోల్బణం సూచీలు ఉన్నాయి. పారిశ్రామిక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికులు, అర్బన్ నాన్ మ్యాన్యువల్ ఎంప్లాయిస్‌కు సంబంధించిన సూచీలతో పాటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం నెలవారీగా విడుదల చేస్తోంది.
¤ బలమైన దేశీయ వినియోగస్థాయి అండతో భారత ఆర్థిక వ్యవస్థ రానున్న అయిదు సంవత్సరాల్లో (2011-12 నుంచి 2015-16) ఏటా సగటున 8.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలుగుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ విడుదల చేసిన ఇండియా - రైజింగ్ ద గ్రోత్ బార్ నివేదికలో పేర్కొంది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (2010 సెప్టెంబరు ఆఖరుకు) దేశ ఆర్థికరంగం 8.9 శాతం వృద్ధిరేటును సాధించడం గమనార్హం. ¤ క్రిసిల్ మేనేజింగ్ డైరెక్టర్- రూప కుద్వా
¤ 2010-11 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.2.99 లక్షల కోట్లు సమకూరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోలిస్తే 19.47 శాతం అధికంగా వృద్ధి నమోదు అయింది.
¤ 2010-11 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకుముందు సంవత్సరం అదే కాలంలోని రూ.2,50,232 కోట్ల నుంచి రూ.2,98,958 కోట్లకు పెరిగాయి. దీంతో బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ.4.30 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యంలో 69.53 శాతం సాధించినట్లయింది. ¤ ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో పేర్కొన్న పన్ను వసూళ్ల లక్ష్యాన్ని మరో రూ.20,000 కోట్లు పెంచి రూ.4.50 లక్షల కోట్లకు సవరిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ప్రకటించారు. ¤ డిసెంబరు 25తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 18.32 శాతానికి చేరింది. అంతక్రితం వారం ఇది 14.44 శాతంగా మాత్రమే ఉంది. ఉల్లి ధరలు ఏకంగా 82 శాతం, కూరగాయల ధరలు 58.85 శాతం పెరగడమే ఆహార ద్రవ్యోల్బణం దాదాపు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడానికి కారణమైంది. ఏడాది కిందట ఇదే సమయానికి ఇది 19.90 శాతంగా ఉంది.
¤ దేశ వస్తు రూప (మర్చండైజ్) ఎగుమతుల్లో డిసెంబరులో 36.4 శాతం వృద్ధి నమోదు అయింది. మొత్తం 22.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించామని, ఇది గత 33 నెలల్లో అత్యధిక స్థాయి అని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ న్యూఢిల్లీలో ప్రకటించారు.
¤ డిసెంబరులో 25.1 బిలియన్ డాలర్ల మేరకు దేశం దిగుమతులు చేసుకుంది. నవంబరు నెలతో పోలిస్తే దిగుమతులు 11.1 శాతం తక్కువగా ఉన్నాయి. ¤ వాణిజ్య లోటు కూడా గత మూడు సంవత్సరాల్లో అత్యంత తక్కువగా 2.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ¤ 2010 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య ఎగుమతులు 29.5 శాతం వృద్ధి చెందాయి. ఆ తొమ్మిది నెలల్లోనూ 164.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 215-225 బిలియన్ డాలర్ల విలువైన వస్తురూప ఎగుమతులను నమోదు చేసే అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు ఇదే కాలంలో దిగుమతులు 247.1 బిలియన్ డాలర్ల మేరకు నమోదయ్యాయి. దిగుమతుల్లో వృద్ధి అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 19 శాతంగా తేలింది. వాణిజ్య లోటు 82.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
¤ రిటైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయి వృత్తి నిపుణులను అందించేందుకు కోకాకోలా - ఐఎస్‌బీ రిటైల్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రకటించింది. హైదరాబాద్ ఐఎస్‌బీ క్యాంపస్‌లో ఈ అకాడమీ ఏర్పాటుకు కోకాకోలా ఇండియాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్రేకర్ ప్రకటించారు.
¤ దేశంలోనే మొట్టమొదటి ఆర్థిక ప్రణాళిక, సలహా సేవల ప్రత్యేక కేంద్రాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో నెలకొల్పింది.
¤ ఎస్‌బీఐ సలహా కేంద్రాల్లోని ఆయా రంగాల్లో అనుభవం ఉన్న అధికారులు ఖాతాదారుల ఆర్థిక పరిస్థితి వారి అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి/ పొదుపునకు అవసరమైన సూచనలు ఇస్తారు. సేవలన్నీ ఉచితం.
¤ ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ (ఆర్ఎన్ఆర్ఎల్)లు సెకండరీ మార్కెట్‌లో 2012 వరకూ పెట్టుబడులు పెట్టకుండా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బహిష్కరణను విధించింది. ఈ రెండు కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులను ఛైర్మన్ అనిల్ అంబానీ సహా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకొంది.
¤ అంతే కాకుండా, ఈ రెండు సంస్థలు అక్రమమైన మార్కెట్ లావాదేవీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పరిష్కరించేందుకు రూ.50 కోట్లను సెటిల్‌మెంట్ ఛార్జిగా విధించింది. ¤ గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటికి బ్యాంక్ సేవలను అందించడమే లక్ష్యంగా ీబ్యాంక్ ఆన్ బైక్ కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ¤ మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శాఖ పరిధిలోని చెర్యాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ¤ ఇందులో భాగంగా బ్యాంక్ సిబ్బంది ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వెళ్లి ప్రజలకు సేవలు అందిస్తారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా సంగారెడ్డి మండలంలోని చెర్యాల, కలివేముల, జూల్‌కల్ గ్రామాలను ఇందుకోసం బ్యాంక్ ఎంపిక చేసింది. ¤ బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ ప్రతిరోజూ ఒక్కో గ్రామంలో నిర్దేశిత సమయంలో రెండు గంటల పాటు లావాదేవీలు కొనసాగిస్తాడు. బ్యాంక్ ఖాతాలు తెరవడం నుంచి రూ.10వేల వరకు డిపాజిట్ చేయడం, డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది.
¤ విదేశాల నుంచి వంట నూనెల దిగుమతులు భారీగా పడిపోయాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో 92,056 టన్నుల దిగుమతులు తగ్గాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేసిన నూనెగింజల పంటల నుంచి దేశీయంగా నూనెల ఉత్పత్తి పెరగడం వల్లనే విదేశాల నుంచి దిగుమతులు తగ్గుముఖం పట్టినట్లు ీసాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది.
¤ రూ. 5కి ఇంటి దగ్గరే బ్యాంకు ఖాతాలను ప్రారంభించే వినూత్న పథకాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) చెన్నై నగర శివారులోని నంబల్ గ్రామంలోశ్రీకారం చుట్టింది. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3 లక్షల ఖాతాలను ప్రారంభించడం తమ ధ్యేయమని బ్యాంకు సీఎండీ ఎం.నరేంద్ర పేర్కొన్నారు.
¤ ఈ పథకంలో భాగంగా బ్యాంకు సిబ్బంది గ్రామాలు, మురికివాడలు తిరిగి రూ.5కే బ్యాంకు ఖాతాను అందిస్తారు. దీనికోసం ఓటరు గుర్తింపుకార్డు, లేదా రేషన్ కార్డు ప్రతిని ఇస్తే సరిపోతుంది.
¤ ముంబయిలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్వహించింది. ప్రధానాంశాలు:
¤ రెపో రేటులో పావు శాతం పెంపు. 65 శాతానికి చేరిక. ¤ రివర్స్ రెపో రేటు లోనూ 0.25% పెంపు. 5.5 శాతానికి చేరిక. తక్షణం ఈ కీలక రేట్లు అమల్లోకి వస్తాయి. ¤ సీఆర్ఆర్, బ్యాంకు రేట్లు యథాతథంగా 6 శాతం వద్దే ఉంచారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లోనూ మార్పులేదు. యథాతథంగా 24 శాతం వద్దే ఉంచారు. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు లక్ష్యాన్ని కూడా మార్పు లేకుండా 8.5 శాతం వద్దే ఉంచారు. ¤ 2010-11 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ లక్ష్యం 5.5 శాతం నుంచి 7 శాతానికి పెంపు. ¤ జీడీపీ వృద్ధి 2010-11 తర్వాత తగ్గే అవకాశం ఉంది. ¤ జీడీపీలో 2010-11కి కరెంట్ ఖాతా లోటు 3.5 శాతంగా అంచనా. ¤ తదుపరి సమీక్ష మార్చి 17న ఉంటుంది. 2011-12 వార్షిక విధాన సమీక్ష మే 3న జరుగుతుంది.
¤ మొట్ట మొదటిసారిగా 12 లక్షల మందికి పైగా సైనికోద్యోగులకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఏటీఎమ్ కార్డులను అందించనుంది. వారు ఈ కార్డులను ఉపయోగించి తమ జీతాన్ని తమ బ్యాంకు ఖాతాలలో నుంచి నేరుగా విత్‌డ్రా చేసే సౌలభ్యం ఉంటుంది. సైన్యానికి, ఎస్‌బీఐకి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
¤ 2009-10 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును ప్రభుత్వం సవరించింది. గతంలో అంచనా వేసిన 7.4 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. తయారీ, సేవల రంగం పనితీరు చలవే దీనికి కారణమని ప్రభుత్వం వెల్లడించింది. తయారీ రంగంలో 8.8శాతం వృద్ధి రేటు నమోదు కాగా ఫైనాన్స్, బీమా, స్థిరాస్తి, వ్యాపార సేవల్లో పెరుగుదల 9.2 శాతం, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్స్‌లో 15 శాతం ఉంది.
¤ 2008-09 ఏడాది వృద్ధి రేటును కూడా ప్రభుత్వం స్వల్పంగా ఊర్థ్వముఖంగా 6.7 శాతం నుంచి 6.8 శాతానికి సవరించింది. 2008-09లో వ్యవసాయ రంగ వృద్ధిరేటు 0.1 శాతం ఉండగా ఆ తర్వాత సంవత్సరం 0.4 శాతానికి పెరిగింది. ¤ తలసరి ఆదాయం 14.5 శాతం పెరిగింది. 2008-09లో రూ. 40,605 ఉండగా 2009-10 సంవత్సరానికి రూ. 46,492కి చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం తలసరి ఆదాయం ఉందని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) వెల్లడించింది. కాగా 2004-05 ధరల్లో అంచనా వేసినపుడు 6 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ¤ ప్రస్తుత ధరల్లో 2009-10 ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 16.1 శాతం పెరిగి రూ. 61,33,230 కోట్లకు చేరింది. 2008-09లో ఇది రూ. 52,82,086 కోట్లు. 2004-05 ఏడాది ధరల్లో 8 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ¤ 2010 మార్చి నాటికి దేశ జనాభా 117 కోట్లు. 2009 మార్చి నాటికి జనాభా 115.4 కోట్లుగా ఉంది. ¤ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 26.7 శాతం వెయిటేజీ కలిగిన మౌలిక పరిశ్రమల ఉత్పత్తి డిసెంబరు నెలకు 6.6 శాతం వృద్ధి చెందింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఈ పరిశ్రమల ఉత్పత్తి పెరుగుదల 6.2 శాతం. ముడి చమురు, పెట్రోలియం రిఫైనరీ రంగాల మెరుగైన పనితీరు వృద్ధిరేటు పెరగడానికి దోహదం చేసింది. ¤ 2010-11 తొలి 9 నెలలకు ద్రవ్య లోటు రూ. 1.71 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ. 3.10 లక్షల కోట్లతో పోలిస్తే 44.75 శాతం తగ్గింది. మెరుగైన పన్ను వసూళ్లు, స్పెక్ట్రమ్ విక్రయం ద్వారా ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం లభించడం ద్రవ్యలోటు తగ్గడానికి దోహదం చేశాయి. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యయాన్ని పెంచక పోవడం, ఆర్‌బీఐ విధానాలు కూడా ద్రవ్యలోటును పరిమితం చేశాయి. ¤ ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ప్రభుత్వ వ్యయం 11.21శాతం పెరిగి రూ. 7.07 లక్షల కోట్ల నుంచి రూ. 7.86 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ. 3.81 లక్షల కోట్లు ఉండగలదని బడ్జెట్‌లో అంచనా వేయగా 9 నెలలు పూర్తయినా ఇందులో 44.9 శాతం మాత్రమే ఉంది. ¤ 2010 డిసెంబరుతో ముగిసిన 9 నెలలకు ప్రభుత్వం రూ. 3.91 లక్షల కోట్లను పన్నుల రూపంలో పసూలు చేసింది. బడ్జెట్ లక్ష్యంలో ఇది 73.2 శాతం |
Monday, July 21, 2014
జనవరి 2011 - ఆర్థిక రంగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment