¤ 2010 ఏప్రిల్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు 20,820 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,36,900 కోట్లు) విలువైన ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31.4 శాతం పెరిగాయి.
¤ 2011 ఫిబ్రవరి ఎగుమతులు 49.7 శాతం వృద్ధితో 2,350 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 21.2 శాతం పెరిగి 3170 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు 820 కోట్ల డాలర్లుగా నమోదయింది. ¤ ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30,530 కోట్ల డాలర్లు విలువైన దిగుమతులు జరిగాయి. పదకొండు నెలల వాణిజ్యలోటు 9,710 కోట్ల డాలర్లు.
¤ జాతీయ దిగువ స్థాయి కనీస వేతనాన్ని రూ. 115కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2011 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కనీస వేతనం రూ. 100గా ఉంది.
¤ విద్యుదుత్పత్తి కంపెనీ ఇంటర్ జెన్‌లో 50 శాతం వాటా విక్రయాన్ని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది. చైనా హ్యూనెంగ్ గ్రూపుతో (సీహెచ్‌జీ) 1.23 బిలియన్ డాలర్ల విలువకు వాటా విక్రయ ఒప్పందం కుదిరింది.
¤ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఎగుమతులు రికార్డు స్థాయి వృద్ధిరేటును నమోదు చేశాయి. 2010-11 ఏడాదికి ఎగుమతులు 37.5 శాతం వృద్ధితో 24,590 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 11,06,550 కోట్లు) పెరిగాయి. మార్చి ఎగుమతుల్లో అత్యంత ఆకర్షణీయంగా 43.9 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ నెలలో 2,910 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
¤ 2010-11 ఏడాదికి 35,030 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. దీంతో మొత్తం ఏడాదికి వాణిజ్య లోటు 10,440 కోట్ల డాలర్లుగా నమోదైంది. మార్చి నెలకు దిగుమతులు 17.3 శాతం పెరిగి 3,470 కోట్ల డాలర్లకు చేరాయి. ¤ భారత విదేశీ వాణిజ్యం దాదాపు 60,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇది భారత స్థూల దేశీయోత్పత్తిలో సగం. ¤ 2010-11 ఏడాదికి ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 84.7 శాతం పెరిగి 6000 కోట్ల డాలర్లకు చేరాయి. ¤ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 50.5 శాతం వృద్ధితో 4,250 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ¤ విలువైన రాళ్లు, ఆభరణాల ఎగుమతులు 15.4 శాతం పెరిగాయి. 3,350 కోట్ల డాలర్ల ఎగుమతులు చేశారు. ¤ 1,030 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేశారు. ఈ విభాగంలో 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. ¤ 2013-14 నాటికి 45,000 కోట్ల డాలర్ల ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. |
Monday, July 21, 2014
ఏప్రిల్ 2011- ఆర్థికరంగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment